త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Surekha Vani | డిలీట్ చేయండి లేదంటే లీగ‌ల్ యాక్ష‌న్ – సురేఖా వాణి వార్నింగ్‌

శ‌నివారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ప‌ర్స‌న‌ల్ వీడియోపై సురేఖావాణి సైబ‌ర్ క్రైమ్‌ను ఆశ్ర‌యించింది. సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న వీడియోలో ఆధారంగా ఇష్టం ఇచ్చిన‌ట్లు రాస్తున్నార‌ని, అవ‌న్నీ త‌న‌ను బాధ‌పెట్టాయంటూ సురేఖావాణి చెప్పింది. వాటిని డిలీట్ చేయాలంటూ వార్నింగ్ ఇచ్చింది.

N

Entertainment | Published On Nov 7, 2026, 7.28 pm IST

Surekha Vani | డిలీట్ చేయండి లేదంటే లీగ‌ల్ యాక్ష‌న్ – సురేఖా వాణి వార్నింగ్‌
Advertisement

Surekha Vani |  సోష‌ల్ మీడియాలో శ‌నివారం చ‌క్క‌ర్లు కొట్టిన‌ ప‌ర్స‌న‌ల్‌ వీడియోపై టాలీవుడ్ న‌టి సురేఖా వాణి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఇక‌పై ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే లీగ‌ల్‌గా యాక్ష‌న్ తీసుకుంటాన‌ని హెచ్చ‌రించింది. ఓ యువ‌కుడితో సురేఖావాణి స‌న్నిహితంగా ఉన్న వీడియో క్లిప్ ఆమె ప‌ర్స‌న‌ల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క‌నిపించింది. ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో సురేఖావాణి డిలీట్ చేసింది.

వీడియో రిలీజ్‌...

త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయ్యింద‌ని, రీచ్ కోసంఈ కంటెంట్‌ను షేర్ చేస్తే ఊరుకోనంటూ పోస్ట్ పెట్టింది. తాజాగా వార్నింగ్ ఇస్తూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. "నిన్న నైట్ నుంచి ఏవోవో చాలా వీడియోలు వ‌స్తున్నాయి. వాటిని ఆధారంగా చేసుకొని సోష‌ల్ మీడియాలో చాలా మంది ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాస్తున్నారు. ఆ వార్త‌ల బాధ‌ను క‌లిగిస్తున్నాయి. . వాట‌న్నింటిని డిలీట్ చేసేలా చూడ‌మ‌ని సైబ‌ర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశా. పోస్ట్‌, షేర్ చేసిన వాళ్లు మీకు మీరుగా డిలీట్ చేస్తే మంచిది' అంటూ ఈ వీడియోలో సురేఖా వాణి పేర్కొన్న‌ది. ఇక మీద‌ట అనుమ‌తి లేకుండా త‌న వీడియోలు, ఫొటోల‌ను పోస్ట్ చేస్తే లీగ‌ల్‌గానే వారిపై యాక్ష‌న్ తీసుకుంటాన‌ని వార్నింగ్ ఇచ్చింది.

49 ఏళ్ల వ‌య‌సులో...

కాగా సురేఖావాణి ప‌ర్స‌న‌ల్ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 49 ఏళ్ల వ‌య‌సులో సురేఖావాణి మ‌ళ్లీ పెళ్లికి సిద్ధ‌మైందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. సురేఖావాణితో పాటు ఆమె కూతురు సుప్రిత‌ను ట్రోల్ చేస్తూ కామెంట్లు పోస్ట్‌లు పెడుతోన్నారు.

 

Advertisement
Advertisement