Surat textile market | సూరత్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. దుకాణాలు ధ్వంసం
Surat textile market | గుజరాత్ (Gujarat)లోని సూరత్ టెక్స్‌టైల్ మార్కెట్ (Surat textile market)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డజనుకుపైగా దుకాణాలు దెబ్బతిన్నాయి.
Surat textile market | త్రినేత్ర.న్యూస్ : టెక్స్‌టైల్ హబ్‌గా పేరుగాంచిన గుజరాత్ (Gujarat)లోని సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. సరోలీ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల వస్త్ర మార్కెట్‌లో అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో డజనుకుపైగా దుకాణాలు దెబ్బతిన్నాయి (shops damaged).
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. 25 అగ్నిమాపక శకటాలతో దాదాపు 150 మంది సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో ఓ ఫైర్‌ఫైటర్‌కి గాయాలైనట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పరేక్ తెలిపారు. గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మరోవైపు ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read..
ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థిని నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం
పోలీసుల తీరుతో కన్నీరు పెట్టుకున్నా మమ్మల్ని కనీసం పట్టించుకోలే..
కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు.. భాష మార్చుకోకపోతే తరిమికొడతారు
తాజావార్తలు
- ●Addanki Dayakar | మేము అప్డేటెడ్ వర్షన్ దళితులం
- ●Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!
- ●Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థికి నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం
- ●BRS MLAs | పోలీసుల తీరుతో కన్నీరు పెట్టుకున్నా మమ్మల్ని కనీసం పట్టించుకోలే..
- ●Adani Enterprises | అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు భారీ పెట్టుబడి.. రూ.9,825 కోట్ల సమీకరణ..
- ●Malavika Mohanan | మాళవిక మోహనన్ వింత కోరిక.. ఆ రోల్లో నటించాలని ఉందట!

Addanki Dayakar | మేము అప్డేటెడ్ వర్షన్ దళితులం

Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!

Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థికి నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం

BRS MLAs | పోలీసుల తీరుతో కన్నీరు పెట్టుకున్నా మమ్మల్ని కనీసం పట్టించుకోలే..






