Wamiqa Gabbi | పంతొమ్మిదేళ్ల కెరీర్‌లో ఫస్ట్ టైమ్ – స్పెషల్ సాంగ్‌లో వామికా గబ్బి…
పంతొమ్మిదేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు స్పెషల్ సాంగ్స్‌లో కనిపించలేదు వామికా గబ్బి . స్టార్ హీరోల సినిమాల్లో ఐటెంసాంగ్స్ చేసే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసింది. విజయ్ సేతుపతి సినిమా కోసం తన రూల్‌ను పక్కనపెట్టింది. పాకెట్ నావెల్ సినిమాలో ఈ పంజాబీ ముద్దుగుమ్మ ప్రత్యేకగీతంలో కనిపించబోతుంది.
Entertainment | Published On Nov 28, 2026, 4.56 pm IST
Wamiqa Gabbi | వామికా గబ్బి పదేళ్ల క్రితమే దక్షిణాదిలో సినిమా చేసింది. కానీ అప్పుడు రానీ క్రేజ్ ఇప్పుడు డీసీ మూవీతో వచ్చింది. ఒకే ఒక్క సినిమాతో సెన్సేషనల్‌గా మారిపోయింది. లోకేష్ కనగరాజ్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన డీసీ మూవీలో వేశ్య పాత్రలో అసమాన నటనను కనబరిచింది. ఆమె నటనకు మహేష్‌బాబు, అల్లు అర్జున్‌తో పాటు చాలా మంది స్టార్లు సైతం ఫిదా అయ్యారు.
డీసీ తర్వాత....
డీసీ తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమైంది వామికా గబ్బి. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఐటెంసాంగ్‌లో కనిపించబోతుంది. ఓ తమిళ సినిమా కోసం విజయ్ సేతుపతితో కలిసి స్టెప్పులు వేయబోతుంది. సూపర్ డీలక్స్ తర్వాత విజయ్ సేతుపతి, డైరెక్టర్ త్యాగరాజన్ కుమారరాజా కాంబినేషన్‌లో పాకెట్ నావెల్ పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ తమిళ సినిమాలో రాజాసాబ్ బ్యూటీ మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటించబోతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
స్పెషల్ సాంగ్...
పాకెట్ నావెల్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో వామికా గబ్బి కనిపించబోతుంది. సినిమాలో ఆమెపై వచ్చే ఈ గ్లామరస్ సాంగ్‌ను డిసెంబర్ 1న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. సినిమా కథ, హీరోహీరోయిన్ల పాత్రల స్వభావాన్ని వివరిస్తూ ఈ పాట సాగుతుందని అంటున్నారు.
పంతొమ్మిదేళ్లు...
వామికా గబ్బి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పంతొమ్మిదేళ్లు అవుతోంది. హీరోయిన్‌గా హిందీ, పంజాబీ, తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసింది. కానీ ఇప్పటివరకు ఒక్క ఐటెంసాంగ్‌లో కూడా కనిపించలేదు. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసింది. విజయ్ సేతుపతి సినిమాలో ప్రత్యేక గీతంలో ఆమె కనిపించబోతుండటం కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
జనవరిలో....
పాకెట్ నావెల్ మూవీ జనవరి 14న థియేటర్లలోకి రాబోతుంది. సూపర్ డీలక్స్ తర్వాత దాదాపు ఏడేళ్ల అనంతరం త్యాగరాజన్ కుమారాజా దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. సూపర్ డీలక్స్ సినిమాకుగాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా విజయ్ సేతుపతికి నేషనల్ అవార్డు వచ్చింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rajinikanth | రజనీకాంత్ వర్సెస్ మహేష్‌బాబు – మూడోసారి బాక్సాఫీస్ క్లాష్ – “ధర్మన్” రిలీజ్ డేట్ ఇదే!
నవంబర్ 27, 2026

Sai Pallavi | కొడుకుకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో చియాన్ విక్రమ్ మూవీ.. హీరోయిన్‌గా సాయిపల్లవి!
నవంబర్ 24, 2026

Raashi Khanna | ఓ వైపు సినిమా – మరోవైపు వెబ్‌సిరీస్ – బ్రేక్ లేకుండా కష్టపడుతోన్న రాశీఖన్నా
నవంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Tirupparankundram | తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం.. 164 ఏళ్ల చరిత్రలో కీలక మలుపు..!
- ●Pakistan-occupied Kashmir | పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ నియోజకవర్గాల పునర్విభజన..
- ●Horrific Incident in Rangareddy District | అయ్యో పాపం! ముగ్గురు ఆడపిల్లలను నీటి సంపులో పడేసిన తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందంటే!
- ●RBI | బంగారం ధరల పతనంతో ఆర్బీఐ అలర్ట్.. గోల్డ్ లోన్లపై నిఘా..
- ●Aadi Srinivas | సాగులో మార్పులతోనే రైతుకు లాభం
- ●Akhilesh Yadav | బీజేపీకి దేశం కంటే ఎన్నికలే ముఖ్యం : అఖిలేష్ యాదవ్

Tirupparankundram | తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం.. 164 ఏళ్ల చరిత్రలో కీలక మలుపు..!

Pakistan-occupied Kashmir | పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ నియోజకవర్గాల పునర్విభజన..

Horrific Incident in Rangareddy District | అయ్యో పాపం! ముగ్గురు ఆడపిల్లలను నీటి సంపులో పడేసిన తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందంటే!

RBI | బంగారం ధరల పతనంతో ఆర్బీఐ అలర్ట్.. గోల్డ్ లోన్లపై నిఘా..



