Horrific Incident in Rangareddy District | అయ్యో పాపం! ముగ్గురు ఆడపిల్లలను నీటి సంపులో పడేసిన తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందంటే!
Horrific Incident in Rangareddy District | ఆ తల్లికి చేతులెలా వచ్చాయో.. ఆ సంపులో ఎలా విసిరేయాలనిపించిందో.. కనీసం కన్న ప్రేమ కూడా గుర్తురాని ఆ కసాయితనమెందుకో? చివరికి ఆ చిన్ని నవ్వులు యాది రాలేవేమో.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Horrific Incident in Rangareddy District | త్రినేత్ర న్యూస్: ఆ తల్లికి చేతులెలా వచ్చాయో.. ఆ సంపులో ఎలా విసిరేయాలనిపించిందో.. కనీసం కన్న ప్రేమ కూడా గుర్తురాని ఆ కసాయితనమెందుకో? చివరికి ఆ చిన్ని నవ్వులు యాది రాలేవేమో.. అభం శుభం తెలియని తన ముగ్గురు ఆరేళ్ల లోపు ఆడ పిల్లల (Three daughters) ను కర్కశంగా సంపులో పడేసి ప్రాణాలు తీసింది. ఆపై తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ హృదయవిదారక ఘటన ఎక్కడ జరిగిందంటే..
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ (Shadnagar) నియోజకవర్గం కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన కందెన చెన్నయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు. అందరూ ఆరేళ్ల లోపువారే. ఏమైందో ఏమో కాని చెన్నయ్య భార్య తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉన్న నీటి సంపులో దూకింది. కూతుళ్లు మృతి చెందగా ఆమె ప్రాణాలతో బయట పడింది.
ఈ సమయంలో భర్త పనికి వెళ్లడంతో ఫోన్‌లో అతనికి సమాచారం అందించారు. వెంటనే ఇంటికి చేరుకున్న చెన్నయ్య.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ముగ్గురు కూతుళ్లు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి బోరున విలపించాడు. గత నాలుగైదు రోజులుగా తన భార్యతో ఎలాంటి గొడవలు జరుగలేదని కన్నీటిపర్యంతమయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
- ●Wamiqa Gabbi | పంతొమ్మిదేళ్ల కెరీర్లో ఫస్ట్ టైమ్ - స్పెషల్ సాంగ్లో వామికా గబ్బి...
- ●RBI | బంగారం ధరల పతనంతో ఆర్బీఐ అలర్ట్.. గోల్డ్ లోన్లపై నిఘా..
- ●Aadi Srinivas | సాగులో మార్పులతోనే రైతుకు లాభం
- ●Akhilesh Yadav | బీజేపీకి దేశం కంటే ఎన్నికలే ముఖ్యం : అఖిలేష్ యాదవ్
- ●KGBV | నిరుద్యోగ మహిళలకు గుడ్న్యూస్.. కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం!
- ●Arjun | పహల్గామ్ ఉగ్రదాడి కథతో సినిమా - ఆయోధ్యలో అర్జున్ దేశభక్తి మూవీ లాంఛ్

Wamiqa Gabbi | పంతొమ్మిదేళ్ల కెరీర్లో ఫస్ట్ టైమ్ - స్పెషల్ సాంగ్లో వామికా గబ్బి...

RBI | బంగారం ధరల పతనంతో ఆర్బీఐ అలర్ట్.. గోల్డ్ లోన్లపై నిఘా..

Aadi Srinivas | సాగులో మార్పులతోనే రైతుకు లాభం

Akhilesh Yadav | బీజేపీకి దేశం కంటే ఎన్నికలే ముఖ్యం : అఖిలేష్ యాదవ్






