BRS MLAs | పోలీసుల తీరుతో కన్నీరు పెట్టుకున్నా మమ్మల్ని కనీసం పట్టించుకోలే..
BRS MLAs | మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే.. సాధారణ మహిళల పరిస్థితి ఏంటని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు (BRS MLAs ) ప్రశ్నించారు. తమకు గాయాలైతే.. సభలో మాకు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు. దెబ్బ తగిలిన మా గురించి మాట్లాడడం లేదని మండిపడ్డారు.
BRS MLAs | త్రినేత్ర.న్యూస్: మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే.. సాధారణ మహిళల పరిస్థితి ఏంటని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు (BRS MLAs ) ప్రశ్నించారు. తమకు గాయాలైతే.. సభలో మాకు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు. దెబ్బ తగిలిన మా గురించి మాట్లాడడం లేదని మండిపడ్డారు. అధికార పార్టీ సభ్యులేమో అమ్మ గురించి, వాళ్ళ అక్కల గురించి ఆలోచించారని మండిపడ్డారు. పోలీసుల తీరుతో మేము కన్నీరు పెట్టుకున్నా మమ్మల్ని కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy), సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Laxma Reddy), కోవా లక్ష్మి (Kova Lakshmi) మీడియాతో చిట్ చాట్ చేశారు. సభలో మాట్లాడేందుకు మాకు అవకాశం ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
తమకు జరిగిన అవమానంపై కేసీఆర్ (KCR) తక్షణమే విచారం వ్యక్తం చేశారన్నారు. స్పీకర్ బాధపడుతున్నారని అంటే వెంటనే విచారం వ్యక్తం చేయాలని కేసీఆర్ చెప్పారు అదీ మా సంస్కారం. తమకు జరిగిన అవమానంపై అధికార పార్టీకి చెందిన మహిళ సభ్యులు తమ వైపు కూడా చూడలేదని వెల్లడిచారు. మంత్రి సీతక్క మావి డ్రామాలు అని ఎలా అంటారు?. తమపై మగ పోలీసులు దాడి చేస్తే.. బయట రాష్ట్రం వాళ్లు పరామర్శిస్తున్నారని చెప్పారు. హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి బాధ్యత వహించి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మగ పోలీసులు కావాలనే తమను లాగారని, తమపట్ల ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారని వాపోయారు. `సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డి లేకుంటే మేము కింద పడిపోయే వాళ్ళం. హరీష్ రావు, కేటీఆర్ చుట్టూ ఆడ పోలీసులను పెట్టారు. మహిళ శాసన సభ్యుల చుట్టూ మగ పోలీసులను పెట్టి శికండి రాజకీయం చేశారు. ఈరోజు మహిళా కానిస్టేబుల్‌కు ఇబ్బంది అయిందని కేసు పెట్టించారు. మేము మహిళలమే కదా… మాకు జరిగిన అవమానంపై సభలో ఎందుకు చర్చ పెట్టరు?.
దళితుల ఆత్మ గౌరవమే.. తెలంగాణ ఆత్మగౌరవమని భట్టి విక్రమార్క అంటున్నారు. మహిళల ఆత్మ గౌరవం తెలంగాణ ఆత్మ గౌరవం కాదా?. మా నాయకులు లేకుంటే, మేము కంచె మీద పడే వాళ్లం. మాకు జరిగిన అవమానంపై సీఎం క్షమాపణ చెప్పాలి. తాతా మధు గురించి మొత్తం విచారణ చేసిన సీఎంకు మహిళా సభ్యుల గురించి పట్టింపు లేదా?. ఎక్కడ ఏం జరిగినా ప్రభుత్వానికి వెంటనే సమాచారం వస్తుంది. మా పై జరిగిన దాడి గురించి ప్రభుత్వానికి ఎందుకు సమాచారం రాలేదు?. తాతా మధు వ్యాఖ్యలను స్పీకర్‌కు ఆపాదించి సభను రెండు రోజులు నడిపించారు. కేసీఆర్ చావు కోరుకున్న ఎమ్మెల్యేపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? సీఎంకు మహిళల గురించి పట్టింపు లేదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం మా మనోభావాలు దెబ్బతినేలా వ్యవహారిస్తున్నారు. గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఏం జరిగినా ప్రకటన చేసే సంప్రదాయం ఉండేది.. ఇప్పుడు కనీసం స్పందన లేదు.` అని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు అన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!
- ●Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థిని నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం
- ●Adani Enterprises | అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు భారీ పెట్టుబడి.. రూ.9,825 కోట్ల సమీకరణ..
- ●Malavika Mohanan | మాళవిక మోహనన్ వింత కోరిక.. ఆ రోల్లో నటించాలని ఉందట!
- ●Chanagani Dayakar | కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు.. భాష మార్చుకోకపోతే తరిమికొడతారు
- ●Ethiks Committee | ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ వ్యవహారం

Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!

Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థిని నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం

Adani Enterprises | అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు భారీ పెట్టుబడి.. రూ.9,825 కోట్ల సమీకరణ..

Malavika Mohanan | మాళవిక మోహనన్ వింత కోరిక.. ఆ రోల్లో నటించాలని ఉందట!






