RBI | బంగారం ధరల పతనంతో ఆర్బీఐ అలర్ట్.. గోల్డ్ లోన్లపై నిఘా..
RBI | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోవడంతో దేశంలో గోల్డ్ లోన్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిఘా పెంచింది. రుణాలకు హామీగా పెట్టిన బంగారం విలువ తగ్గుతుండడంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాల నాణ్యతపై సమీక్ష చేపట్టింది. ఇప్పటికే కొన్ని సంస్థల్లో గోల్డ్ లోన్ల చెల్లింపుల సమస్యలు పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
RBI | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోవడంతో దేశంలో గోల్డ్ లోన్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిఘా పెంచింది. రుణాలకు హామీగా పెట్టిన బంగారం విలువ తగ్గుతుండడంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాల నాణ్యతపై సమీక్ష చేపట్టింది. ఇప్పటికే కొన్ని సంస్థల్లో గోల్డ్ లోన్ల చెల్లింపుల సమస్యలు పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
నిబంధనల ఉల్లంఘనలపై ఆర్‌బీఐ పరిశీలన..
భారత్‌లో సుమారు 247 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.20 లక్షల కోట్లకు పైగా) గోల్డ్ లోన్ మార్కెట్‌పై ఆర్బీఐ పర్యవేక్షణను కఠినతరం చేసింది. బంగారం ధరలు భారీగా తగ్గడంతో రుణాలకు హామీగా తీసుకున్న బంగారం విలువ పడిపోతోంది. ఈ నేపథ్యంలో రుణాల నాణ్యత, తిరిగి చెల్లింపుల పరిస్థితి, తాకట్టు పెట్టిన బంగారంతో పోలిస్తే మంజూరైన రుణాల మొత్తాన్ని ఆర్బీఐ పర్యవేక్షణ అధికారులు సమీక్షిస్తున్నారు. సాధారణంగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) బంగారం విలువలో గరిష్ఠంగా 85 శాతం వరకు రుణాలు అందిస్తున్నాయి. ఈ పరిమితిని ఏవైనా సంస్థలు ఉల్లంఘిస్తున్నాయా అనే అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోంది. అయితే ఇప్పటివరకు నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆధారాలు లభించలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. జనవరిలో గరిష్ఠ స్థాయికి చేరిన బంగారం ధరలు అప్పటి నుంచి సుమారు 30 శాతం పడిపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరింత కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరిస్తుందన్న అంచనాలతో ఇటీవల ధరల పతనం వేగవంతమైంది.
రూ.23 లక్షల కోట్లకు గోల్డ్ లోన్ పరిశ్రమ..
గత ఐదేళ్లలో భారత్‌లో గోల్డ్ లోన్ పరిశ్రమ దాదాపు ఐదు రెట్లు విస్తరించి రూ.23 లక్షల కోట్లకు చేరినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. ఈ మార్కెట్‌లో సుమారు 60 శాతం ఇప్పటికీ అసంఘటిత రంగంలోనే ఉంది. సెప్టెంబర్ నాటికి దేశీయ బ్యాంకు రుణాల్లో గోల్డ్ లోన్ల వాటా సుమారు 2.5 శాతంగా ఉండడంతో తక్షణమే వ్యవస్థాగత ముప్పు పరిమితంగానే ఉందని అంచనా. అయితే బంగారం ధరలు మరింత కాలం తగ్గితే రుణగ్రహీతలు అదనపు బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుంది లేదా తీసుకున్న రుణంలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలా చేయలేకపోతే రుణాల చెల్లింపుల్లో జాప్యం, మొండి బకాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ విభాగంలో మొండి బకాయిల వాటా జూన్ త్రైమాసికంలో 0.6 శాతం ఉండగా, సెప్టెంబర్ చివరి నాటికి 0.9 శాతానికి పెరిగింది. దేశంలో అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ రుణ సంస్థగా ఉన్న బజాజ్ ఫైనాన్స్‌లోనూ చెల్లింపుల ఒత్తిడిని ఎదుర్కొంటున్న గోల్డ్ లోన్ల వాటా 1.87 శాతం నుంచి 2.02 శాతానికి పెరిగింది.
గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలపై ఒత్తిడి..
కాగా, గత నెలలో విశ్లేషకులతో జరిగిన సమావేశంలో పిరామల్ ఫైనాన్స్ సీఈఓ జైరామ్ శ్రీధరన్ గోల్డ్ లోన్లను అభివృద్ధి చెందుతున్న కీలక రిస్క్ విభాగంగా అభివర్ణించారు. వాయిదా పద్ధతిలో వడ్డీ చెల్లింపులకు అనుమతించని సవరించిన నిబంధన కూడా రుణాల చెల్లింపుల్లో జాప్యానికి ఒక కారణమవుతోందని సమాచారం. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలపై ఒత్తిడి కొనసాగే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. బంగారం ధరల పతనం రుణగ్రహీతలతోపాటు రుణాలు అందించిన ఆర్థిక సంస్థలకూ సవాలుగా మారుతోంది.
తాజావార్తలు
- ●Aadi Srinivas | సాగులో మార్పులతోనే రైతుకు లాభం
- ●Akhilesh Yadav | బీజేపీకి దేశం కంటే ఎన్నికలే ముఖ్యం : అఖిలేష్ యాదవ్
- ●KGBV | నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్.. కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం!
- ●Arjun | పహల్గామ్ ఉగ్రదాడి కథతో సినిమా - ఆయోధ్యలో అర్జున్ దేశభక్తి మూవీ లాంఛ్
- ●Fab City Land Scam | ఫ్యాబ్ సిటీ భూ స్కాంపై.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టుకు హ్యాట్సాఫ్
- ●India Exports | ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డు.. 45 శాతం వృద్ధి..

Aadi Srinivas | సాగులో మార్పులతోనే రైతుకు లాభం

Akhilesh Yadav | బీజేపీకి దేశం కంటే ఎన్నికలే ముఖ్యం : అఖిలేష్ యాదవ్

KGBV | నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్.. కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం!

Arjun | పహల్గామ్ ఉగ్రదాడి కథతో సినిమా - ఆయోధ్యలో అర్జున్ దేశభక్తి మూవీ లాంఛ్






