Personal Intelligence | ఏఐ మరింత మెరుగ్గా.. భారత యూజర్లకు గూగుల్ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్..
Personal Intelligence | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన జెమిని ఏఐ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే అమెరికా యూజర్ల కోసం పర్సనల్ ఇంటెలిజెన్స్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫీచర్‌కు మరిన్ని మెరుగులు దిద్ది దీన్ని ప్రస్తుతం భారతీయ యూజర్లకు గూగుల్ అందుబాటులోకి తెచ్చింది.
Technology | Published On Apr 15, 2026, 11.02 am IST
Personal Intelligence | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన జెమిని ఏఐ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే అమెరికా యూజర్ల కోసం పర్సనల్ ఇంటెలిజెన్స్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫీచర్‌కు మరిన్ని మెరుగులు దిద్ది దీన్ని ప్రస్తుతం భారతీయ యూజర్లకు గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇండియన్ వెర్షన్ లో ఇక్కడి పౌరుల అభిరుచులు, ఇతర విషయాలకు అనుగుణంగా పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ పనిచేస్తుంది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు గూగుల్‌కు చెందిన జీమెయిల్, ఫొటోస్, యూట్యూబ్, సెర్చ్ వంటి యాప్‌లను ఏఐతో అనుసంధానం చేసి వాటిలోని సమాచారం ఆధారంగా జెమిని సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇది పూర్తిగా వ్యక్తిగత ఆసక్తులకు అనుగుణంగా పనిచేస్తుంది. అలాగే డిజిటల్ పనులను సులభతరం చేస్తుంది.
యాప్స్‌కు కనెక్ట్ అయి సేవలను అందిస్తుంది..
పర్సనల్ ఇంటెలిజెన్స్ రెండు ముఖ్యమైన అంశాలను ఆధారంగా చేసుకుని పనిచేస్తుంది. వివిధ క్లిష్టమైన సమాచాన వనరులను విశ్లేషించడం, అనుసంధానం చేయబడిన యాప్స్ నుంచి నిర్దిష్టమైన వివరాలను సేకరించడం, టెక్ట్స్, ఫొటోలు, వీడియోల డేటాను పోల్చి చూసి యూజర్లకు మరింత సందర్భోచితమైన సమాధానాలను ఇవ్వడం వంటి పనులను నిర్వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక యూజర్ జైపూర్ వెళ్లడానికి నా ట్రావెల్ ప్లాన్ ఏంటి..? అని అడిగితే సాధారణ సెర్చ్ ఫలితాలకు బదులుగా జీమెయిల్‌లోని బుకింగ్ వివరాలను తీసుకోవడం, గూగుల్ ఫొటోస్‌లో సేవ్ చేసిన మ్యాప్ స్క్రీన్ షాట్ లేదా గిఫ్ట్ ఐడియాలను చూపించడం, యూట్యూబ్‌లో చూసిన వీడియోల ఆధారంగా ఆహార సూచనలు ఇవ్వడం వంటి పనులు చేస్తుంది. దీని వల్ల యూజర్లు వేర్వేరు యాప్‌లలో ఆయా వివరాలను సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు.
ప్రైవసీ, డేటా నియంత్రణకు అధిక ప్రాధాన్యత..
పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ రూపకల్పనలో యూజర్ల ప్రైవసీ, డేటా నియంత్రణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ప్రతి భారతీయ యూజర్‌కు ఆఫ్‌లోనే ఉంటుంది. అందువల్ల కేవలం దీన్ని కావాలనుకునే యూజర్లు మాత్రమే ఆన్ చేసి వాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఫీచర్ ను ఆన్ చేసిన తరువాత ఏయే గూగుల్ యాప్ లను ఏఐతో అనుసంధానించాలి వంటి ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. దీంతో కావాలనుకునే యాప్ లను మాత్రమే ఏఐతో అనుసంధానం చేయవచ్చు. అలాగే వాటిని అవసరం అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను యూజర్లు వాడుకుంటే వారి డేటా ఇప్పటికే గూగుల్ సెక్యూరిటీ సిస్టమ్‌లలో ఉంటుంది కనుక ఆ డేటాకు సేఫ్టీ ఉంటుంది. అలాగే థర్డ్‌పార్టీ వ్యక్తులు లేదా సంస్థలకు ఆ డేటాను యాక్సెస్ చేసే వీలు ఉండదు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో ప్రైవసీ ఉంటుందని గూగుల్ తెలిపింది. ఇక పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ద్వారా జెమిని ఇచ్చే సమాధానాలకు సంబంధించి అది వాడుకునే సోర్స్ వివరాలను కూడా యూజర్లకు తెలియజేస్తుంది.

ఇష్టమైన ప్రశ్నలు అడగవచ్చు..
యూజర్లు జెమినితో సంభాషించేటప్పుడు తమకు ఇష్టమైనట్లుగా ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు నాకు విండో సీట్ అంటే ఇష్టం అని చెబితే జెమిని దాన్ని స్టోర్ చేసుకుని యూజర్‌కు దానికి అనుగుణంగా భవిష్యత్తులో సమాధానాలు ఇస్తుంది. అలాగే ఆరోగ్య సమాచారం వంటి సున్నితమైన అంశాలపై ఏఐ స్వయంగా ఊహించకుండా నిరోధించే సెక్యూరిటీ సిస్టమ్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. తాత్కాలిక్ చాట్‌లను ఉపయోగించడం, పర్సనలైజేషన్ లేకుండా సమాధానాలను పొందడం వంటి ఆప్షన్లను కూడా ఇందులో అందిస్తున్నారు. ఇక ఏఐకి అనుసంధానించే యాప్స్‌లో ఉండే యూజర్ సమాచారాన్ని ఏఐ తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించదు. అంటే ఆ డేటా సహాయంతో ఏఐ మోడల్ ట్రెయినింగ్ అయ్యే అవకాశం లేదు. అలాగే దాన్ని బట్టి గూగుల్ కూడా యూజర్లకు ప్రకటనలను అందించదు. ఈ విషయంలో కచ్చితమైన నిబంధనలను పాటిస్తామని గూగుల్ స్పష్టం చేసింది.
బీటా దశలోనే ఉంది..
పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ప్రస్తుతం బీటా దశలోనే ఉందని, అందువల్ల ఇందులో యూజర్లకు ఎప్పుడైనా చిన్న చిన్న సమస్యలు, బగ్స్ ఎదురు కావచ్చని గూగుల్ పేర్కొంది. ఓవర్ పర్సనలైజేషన్ చేస్తే కొద్దిగా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలాగే పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ సహాయంతో జెమిని తప్పు సమాధానాలను ఇచ్చిందని యూజర్ భావిస్తే సమాధానం కిందనే ఉండే థంబ్స్ డౌన్‌పై క్లిక్ చేయవచ్చు. దీంతో ఆ ఫీడ్ బ్యాక్ తీసుకుని జెమిని మరింత మెరుగైన సమాధానాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అయితే సమాధానాలు నచ్చితే థంబ్సప్‌ను క్లిక్ చేయవచ్చు. దీంతో అలాంటి సమాధాలను ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి.
పెయిడ్ యూజర్లకు మాత్రమే..
పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ప్రస్తుతం భారత్‌లో గూగుల్ ఏఐ ప్లస్, ప్రొ, అల్ట్రా సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంది. అయితే త్వరలోనే ఉచిత యూజర్లకు కూడా దీన్ని అందుబాటులోకి తెస్తామని గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్‌ను యూజర్లు జెమిని యాప్ లో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను యాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి పర్సనల్ ఇంటెలిజెన్స్ అనే విభాగంలో ఉండే కనెక్టెడ్ యాప్స్‌ను ఎంచుకోవాలి. తరువాత యూజర్‌కు తనకు కావల్సిన గూగుల్ యాప్స్‌ను ఏఐ తో అనుసంధానించవచ్చు. తరువాత పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ పనిచేస్తుంది. ఈ ఫీచర్ వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Priyanka Chopra | ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించిన ఒకే ఒక తమిళ మూవీ – దళపతి విజయ్ హీరో – యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్
అక్టోబర్ 3, 2026

Artificial Intelligence | ఏఐతో ఆర్థిక నిపుణుల కొలువులకు ఎసరు.. స్వల్ప ఛార్జీలకే సలహాలు..
అక్టోబర్ 3, 2026

Harish Rao | గుండె లోతుల్లోంచి రాసే కవిత్వానికి.. ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ
- ●Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు
- ●Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం
- ●Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి
- ●Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు
- ●Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు

Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ

Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు

Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం

Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి



