ED Raids | పంజాబ్ రాజ్యసభ సభ్యుడి అశోక్ మిట్టల్ ఇంట్లో ఈడీ సోదాలు..!
ED Raids | పంజాబ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిట్టల్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం దాడులు నిర్వహించింది. బుధవారం ఉదయం జలంధర్, ఫగ్వారాలోని ఇల్లు, ఆయన సంస్థలు, వ్యాపార స్థలాల్లో ఈ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.
ED Raids | పంజాబ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిట్టల్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం దాడులు నిర్వహించింది. బుధవారం ఉదయం జలంధర్, ఫగ్వారాలోని ఇల్లు, ఆయన సంస్థలు, వ్యాపార స్థలాల్లో ఈ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో ఢిల్లీకి చెందిన ఈడీ బృందాలు పలు ప్రాంతాలను దిగ్బంధించాయి. మిట్టల్ నివాసం వెలుపల పోలీసులను మోహరించారు. అధికారులు పత్రాలు, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఎల్‌పీయూ (LPU)తో సహా లవ్లీ గ్రూప్‌కు సంబంధించిన పలు సంస్థలకు ఈడీ బృందాలు చేరుకున్నాయి. నివేదికల ప్రకారం.. లవ్లీ ఆటోస్, లవ్లీ స్వీట్స్, లవ్లీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లపై సైతం విచారణ జరుగుతున్నట్లు సమాచారం. మిట్టల్ కుటుంబానికి చెందిన నివాస, వ్యాపార సంస్థాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే, వారి బంధువుల నివాసాల్లోనూ ఈడీ బృందాలు దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫెమా (విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం) ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీ అధికారులు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, విదేశీ నిధులకు సంబంధించిన పత్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దాను రాజ్యసభ ఉప నేత పదవి నుంచి తొలగించి, ఆ బాధ్యతను అశోక్ మిట్టల్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్న కొద్దిరోజుల్లోనే ఈడీ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈడీ దాడులపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సెటైరికల్‌గా స్పందించారు. పంజాబ్ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించిందని, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ అశోక్ ఇల్లు, విశ్వవిద్యాలయంలో ఈడీ సోదాలు చేస్తోందని ఆరోపించారు. ఇది మోదీ స్టయిల్ అని.. మనం కొమ్మ నుంచి రాలిపడే ఆకులం కాదు. తుఫానులను వాటి హద్దుల్లోనే ఉండమని చెప్పండి అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "పంజాబ్‌లో మోదీ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించారు. కానీ, పంజాబ్ ప్రజలు దీన్ని సహించరు. వారు బీజేపీకి తగిన సమాధానం ఇస్తారు" అని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vivo India | దేశవ్యాప్తంగా 10 మంది టీచర్లకు వివో ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్
- ●Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు
- ●Chamala Kirankumar Reddy | రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు సినిమా చూపించబోతున్నం
- ●Paradise Movie | మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్యారడైజ్ చిత్రబృందం ప్రత్యేక పూజలు
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ పై అదిరిపోయే డీల్.. రూ.57 వేల వరకు ఆదా..
- ●Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..

Vivo India | దేశవ్యాప్తంగా 10 మంది టీచర్లకు వివో ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్

Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు

Chamala Kirankumar Reddy | రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు సినిమా చూపించబోతున్నం

Paradise Movie | మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్యారడైజ్ చిత్రబృందం ప్రత్యేక పూజలు






