త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Double Engine Disaster | “డ‌బుల్ డిజాస్ట‌ర్‌”.. 5 నెల‌ల్లో 2,454 అత్యాచారాలు, 600 హ‌త్య‌లు

Double Engine Disaster | ప‌శ్చిమ బెంగాల్‌లో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా క్షీణించాయని తృణ‌మూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) విమ‌ర్శించారు.

D

National | Published On Oct 7, 2026, 5.09 pm IST

Double Engine Disaster | “డ‌బుల్ డిజాస్ట‌ర్‌”.. 5 నెల‌ల్లో 2,454 అత్యాచారాలు, 600 హ‌త్య‌లు
Advertisement

Double Engine Disaster | త్రినేత్ర న్యూస్ : ప‌శ్చిమ బెంగాల్‌లో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా క్షీణించాయని తృణ‌మూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) విమ‌ర్శించారు. బీజేపీ (BJP) అధికారంలోకి వ‌చ్చిన కేవ‌లం ఐదు నెల‌ల్లోనే నేరాలు తీవ్ర‌స్థాయిలో పెరిగిపోయాయ‌న్నారు. ఈ మేర‌కు TMC నేత సాకేత్ గోఖలే దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం (RTI) దరఖాస్తుకు పశ్చిమ బెంగాల్ స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (SCRB) ఇచ్చిన సమాధానం దిగ్భ్రాంతికి గురి చేస్తోంద‌న్నారు.

రాష్ట్రంలో సువేందు అధికారి ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టిన మే నెల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ గ‌డిచిన ఐదు నెల‌ల్లోనే రాష్ట్రంలో 2,454 అత్యాచారాలు, 600 హ‌త్య‌లు, 13,114 హ‌త్యాయ‌త్నాలు, 32,341 దాడులు వెలుగుచూసిన‌ట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి స‌మాచారాన్ని ఆయ‌న ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ ప్ర‌భుత్వంపై అభిషేక్ బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ డబుల్ ఇంజిన్ విపత్తుకు ఈ గణాంకాలే నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. "రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తెస్తామని హామీ ఇచ్చారు. కానీ బెంగాల్‌కు మాత్రం డబుల్ ఇంజిన్ విపత్తు మిగిలింది" అంటూ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

Also Read..

నా గోల్ 100.. ప్ర‌తీ ఎఫ్ఐఆర్‌ను మెడ‌ల్‌గా భావిస్తా : రాహుల్ గాంధీ

రసాయన శాస్త్రంలో ఇద్ద‌రికి నోబెల్‌

భారతీయ యువ గణిత శాస్త్రవేత్తకు రామానుజన్ ప్రైజ్

Advertisement
Advertisement