Kangana Ranaut | యువతే దేశానికి బలమైన శక్తి.. జెన్‌జీ విషయంలో స్వరం మార్చిన కంగన
Kangana Ranaut | జెన్ జీ (Gen Z) విషయంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) తన స్వరం మార్చారు. యువతే మన దేశ బలం అంటూ వ్యాఖ్యానించారు. యువత మన సాంప్రదాయాలను పాటిస్తూ, ప్రపంచానికి మన గుర్తింపును చాటిచెబుతున్నారని ప్రశంసించారు.
Kangana Ranaut | త్రినేత్ర.న్యూస్ : జెన్‌జీ (Gen Z) విషయంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) తన స్వరం మార్చారు. మొన్నటి వరకూ జెన్ జీ నిరసనకారుల్ని జనరేషన్ గట్టర్‌గా అభివర్ణించిన ఆమె.. ఇప్పుడు వారే మన దేశ బలం అంటూ వ్యాఖ్యానించారు. ఒక విధంగా చెప్పాలంటే దేశానికి జెన్‌జీ గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు. యువత మన సాంప్రదాయాలను పాటిస్తూ, ప్రపంచానికి మన గుర్తింపును చాటిచెబుతున్నారని ప్రశంసించారు.
జెన్-జీ (Gen Z) యువత దేశ సంస్కృతికి రాయబారులుగా మారుతుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ తరం పట్ల ఎంతో గర్విస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జెన్ జీ సమస్యలు నిజమైనవి, వారిని తాను గుడ్డిగా నమ్ముతానంటూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ (Mohan Bhagwat) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కంగన జెన్‌జీ విషయంలో తన స్వరం మార్చడం గమనార్హం. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అనుభవం, జ్ఞానం దేశ యువతకు, భావితరాలకు ఎంతగానో మార్గదర్శకమని కంగన పేర్కొన్నారు.
మరోవైపు జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనలపై కూడా కంగన స్పందించారు. అక్కడ నిరసన తెలుపుతున్న విద్యార్థులు శాంతియుతంగా, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాల విజయాలకు యువత మద్దతే కారణమని చెప్పుకొచ్చారు. మెజారిటీ యువత దేశ అభివృద్ధికి వెన్నెముక అని తెలిపారు. అయితే, కొద్దిమంది ప్రవర్తనతో యావత్ జెన్‌జీ తరాన్ని అంచనా వేయలేమని స్పష్టం చేశారు. "జెన్‌జీ దేశానికే బలమైన శక్తి. నిరసనల సమయంలో కొద్దిమంది వ్యక్తులు దుర్భాషలాడుతూ లేదా అల్లర్లకు పాల్పడుతూ ప్రవర్తించిన తీరును బట్టి మొత్తం తరానికే ఒక ముద్ర వేయడం సరికాదు. జెన్ జెడ్ ఇచ్చిన మద్దతు వల్లే మా ప్రభుత్వం ఇన్ని రోజులు అధికారంలో ఉంది" అని కంగన వ్యాఖ్యానించారు.
అంతకు ముందు జెన్ జెడ్‌ను ఉద్దేశించి కంగన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జెన్ జెడ్ నిరసనకారుల్ని జనరేషన్ గట్టర్‌గా అభివర్ణించారు. నిరసనకారులు ఓ మురికి కాలువ లాంటివారన్నారు. నీట్ ప్రొటెస్ట్ వీడియోలు చూస్తే వాంతి వచ్చేలా ఉన్నాయన్నారు. తన జీవితంలో ఒకే దగ్గర ఇంత కంపును ఎప్పుడూ చూడలేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు వారు దేశానికే బలం అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
VIDEO | Parliament Monsoon Session: BJP MP Kangana Ranaut, on RSS chief Mohan Bhagwat's interaction with Gen Z and Gen Alpha, says, "Gen Z is the strength of our country and, in a way, a great asset to our nation. We are very happy that our young people are increasingly emerging… pic.twitter.com/G3YYYDxI1S
— Press Trust of India (@PTI_News) August 7, 2026
Also Read..
సమస్య పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్తే తప్పేంటి..? సీఎం విజయ్ Vs జూనియర్ స్టాలిన్
ఆటో డ్రైవర్ హత్య.. హైడ్రా సహాయంతో సరూర్‌నగర్ చెరువులో కత్తి వెలికితీత
సంబంధిత వార్తలు

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
సెప్టెంబర్ 20, 2026

Gen Z | సీనియర్లను మట్టికరిపించారు.. జైపూర్ ఎన్నికల్లో జెన్ జీ యూవత
సెప్టెంబర్ 16, 2026

Kangana Ranaut | టార్గెట్ ఎప్పుడూ మహిళే.. ఆ ధోరణి ఎప్పుడు మారుతుందో..? : త్రిష వివాదంపై కంగన రనౌత్
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..

V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు



