Gen Z | సీనియర్లను మట్టికరిపించారు.. జైపూర్ ఎన్నికల్లో జెన్ జీ యూవత
Gen Z | రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జెన్ జీ యువత (Gen Z candidates) సత్తా చాటారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించిన యువత తమ కంటే సీనియర్లను మట్టికరిపించారు.
Gen Z | త్రినేత్ర.న్యూస్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జెన్ జీ యువత (Gen Z candidates) సత్తా చాటారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించిన యువత తమ కంటే సీనియర్లను మట్టికరిపించారు. జైపూర్ మున్సిపాలిటీలో (Jaipur Municipal Corporation) మొత్తం 150 వార్డులు ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 18 మంది నవ యువకులను (Gen Z) బరిలోకి దింపాయి. వారిలో ఆరుగురు అభ్యర్థులు విజయం సాధించారు. నలుగురు కాంగ్రెస్ (Congress) నుంచి గెలుపొందగా, మిగిలిన ఇద్దరు బీజేపీ (BJP) నుంచి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 మందికి, బీజేపీ ఆరుగురు జెన్ జీలకు టికెట్లు ఇచ్చాయి.
విజేతల్లో అతి పిన్న వయస్కుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 ఏండ్ల ఫైజ్ హసన్. 71వ వార్డు నుంచి పోటీచేసి అతడు 39 ఏండ్ల స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ సలీన్‌ను ఓడించాడు. పదో వార్డు నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి పాలక్ యాదవ్ (21) 39 ఏండ్ల కాంగ్రెస్ క్యాండిడేట్ వందనా జఖర్‌ను మట్టికరిపించాడు. ఇక 29 ఏండ్ల సూరజ్ గొడివాల్ 115 వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశాడు. అతడు 67 ఏండ్ల కాంగ్రెస్ క్యాండిడేట్ సురేశ్ బివాల్‌ను 1,063 ఓట్లతో ఓడించాడు. జైపూర్ మున్సిపాలిటీలోనే కాకుండా.. అల్వార్ జిల్లాలోని తనగాజి వార్డుకు జరిగిన ఎన్నికల్లో 21 ఏండ్ల జర్నలిస్టు నేహా శర్మ విజయం సాధించారు. రాజకీయాల్లో కూడా జెన్ జీ యువత (Young Candidates) రాణించవచ్చని ఈ ఎన్నికల ద్వారా నిరూపించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

DK Shivakumar | ట్రంప్ కూడా కాంగ్రెస్ పథకాలనే కాపీ కొడుతున్నారు.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
సెప్టెంబర్ 15, 2026

Kishan Reddy | తెలంగాణ విమోచన వేడుకలు జరిపేందుకు భయపడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సెప్టెంబర్ 15, 2026

KTR | తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తున్న పోలీసు శాఖ: కేటీఆర్
సెప్టెంబర్ 15, 2026
తాజావార్తలు
- ●CPRI Recruitment | సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 112 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, డిప్లొమా అభ్యర్థులు అర్హులు
- ●US Tariffs | భారత్‌పై అమెరికా 100 శాతం టారీఫ్‌లు.. తుదిదశకు బిల్లు
- ●Horoscope | సెప్టెంబర్ 16 రాశిఫలాలు.. ఊహించని సమాచారం అందుతుంది!
- ●Superintelligence Human Control | ఏఐ ముసుగులో పెను ముప్పు.. మనుషుల చేతుల్లో లేకపోతే ఏఐ వ్యర్థం : సత్య నాదెళ్ల స్ట్రాంగ్ వార్నింగ్
- ●Malayalam | మలయాళ హీరోయిన్ను పెళ్లిచేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాటోగ్రాఫర్
- ●KTR | రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ : కేటీఆర్

CPRI Recruitment | సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 112 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, డిప్లొమా అభ్యర్థులు అర్హులు

US Tariffs | భారత్‌పై అమెరికా 100 శాతం టారీఫ్‌లు.. తుదిదశకు బిల్లు

Horoscope | సెప్టెంబర్ 16 రాశిఫలాలు.. ఊహించని సమాచారం అందుతుంది!

Superintelligence Human Control | ఏఐ ముసుగులో పెను ముప్పు.. మనుషుల చేతుల్లో లేకపోతే ఏఐ వ్యర్థం : సత్య నాదెళ్ల స్ట్రాంగ్ వార్నింగ్



