Hyderabad | ఆటో డ్రైవర్ హత్య.. హైడ్రా సహాయంతో సరూర్‌నగర్ చెరువులో కత్తి వెలికితీత
Hyderabad | సైదాబాద్ సింగరేణి కాలనీలో మహమ్మద్ ఫాసి అహ్మద్ అమీర్(21) అనే యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడు ఆటో డ్రైవర్ ఎండ్రావత్ సుమన్(21)ను పోలీసులు అరెస్టు చేశారు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : సైదాబాద్ సింగరేణి కాలనీలో మహమ్మద్ ఫాసి అహ్మద్ అమీర్(21) అనే యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడు ఆటో డ్రైవర్ ఎండ్రావత్ సుమన్(21)ను పోలీసులు అరెస్టు చేశారు. అమీర్‌ను హత్య చేసేందుకు వినియోగించిన కత్తిని సరూర్‌నగర్ చెరువులో స్వాధీనం చేసుకున్నారు.
అయితే పాతకక్షల కారణంగా.. ఆగస్టు 6న అమీర్‌పై సుమన్ కొబ్బరి బొండాల కత్తితో నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం సుమన్ సరూర్ నగర్ చెరువు వైపు ఆటోలో వెళ్లి.. కత్తిని అక్కడ పడేశాడు. సాక్ష్యాధారాలు ఎవరికీ లభించొద్దనే ఉద్దేశంతోనే కత్తిని చెరువులో పడేసినట్లు పోలీసుల విచారణలో తెలిపారు.
నిందితుడి నుంచి రక్తపు మరకలున్న దుస్తులు, ఆటో, మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైడ్రా సహాయంతో సరూర్‌నగర్ చెరువు నుంచి కత్తిని వెలికితీశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. అనంతరం 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
తాజావార్తలు
- ●KCR | మా కేసీఆర్‌ను మీ బిడ్డలా కాపాడండి.. ఒక అభిమాని గుండె చప్పుడు ఇది..
- ●Police Constables | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీసు కానిస్టేబుళ్లకు వయోపరిమితి పెంపు
- ●NHRC | క్షుద్ర రాజకీయాలకు ఎన్హెచ్ఆర్సీ బ్రేక్.. చర్యలకు డీజీపీకి కమిషన్ ఆదేశం
- ●CM Revanth Reddy | 'ఫేక్' రాజకీయాలు చేస్తున్న 'ఆవేశం స్టార్' రేవంత్ రెడ్డి
- ●Congress Party | అసలు కుట్రదారులపై అత్యంత కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోండి
- ●Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌కు, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు

KCR | మా కేసీఆర్‌ను మీ బిడ్డలా కాపాడండి.. ఒక అభిమాని గుండె చప్పుడు ఇది..

Police Constables | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీసు కానిస్టేబుళ్లకు వయోపరిమితి పెంపు

NHRC | క్షుద్ర రాజకీయాలకు ఎన్హెచ్ఆర్సీ బ్రేక్.. చర్యలకు డీజీపీకి కమిషన్ ఆదేశం

CM Revanth Reddy | 'ఫేక్' రాజకీయాలు చేస్తున్న 'ఆవేశం స్టార్' రేవంత్ రెడ్డి






