Kangana Ranaut | టార్గెట్ ఎప్పుడూ మహిళే.. ఆ ధోరణి ఎప్పుడు మారుతుందో..? : త్రిష వివాదంపై కంగన రనౌత్
Kangana Ranaut | మహిళల్ని కించపరిచేందుకు వారి వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేయడం ఎప్పటినుంచో వస్తోన్న ధోరణేనని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ (Kangana Ranaut) తెలిపారు. దీన్ని ప్రపంచ వ్యాప్త సమస్యగా అభివర్ణించారు.
Kangana Ranaut | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడులో ప్రముఖ నటి త్రిష (Actor Trisha) వివాదంపై బీజేపీ మండి ఎంపీ కంగన రనౌత్ (Kangana Ranaut) తీవ్రంగా స్పందించారు. మహిళల్ని కించపరిచేందుకు వారి వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేయడం ఎప్పటినుంచో వస్తోన్న ధోరణేనని చెప్పారు. ఇది మన దేశానికే పరిమితం కాలేదని వ్యాఖ్యానించారు. దీన్ని ప్రపంచ వ్యాప్త సమస్యగా కంగన అభివర్ణించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (DISHA) సమావేశం ముగిసిన తర్వాత కంగనా మీడియాతో మాట్లాడారు. "తమిళనాడులో ఏం జరిగిందో మీరందరూ చూశారు. ఓ ప్రముఖ నటి విషయంలో వివాదం చెలరేగింది. కానీ దూషణలు, వ్యక్తిత్వ హననం విషయానికొస్తే మాత్రం ఎప్పుడూ ఒక మహిళనే లక్ష్యంగా చేసుకుంటారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళను మానసికంగా దెబ్బతీయడానికి వారి వ్యక్తిగత జీవితాన్ని, చరిత్రను లక్ష్యంగా చేసుకోవడం (charater assassination) కొత్తేమీ కాదు. ఈ సమస్య మన దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతోంది" అని కంగన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై ఈ దాడులు ఎప్పటికి ఆగుతాయని ప్రశ్నించారు. మహిళల పట్ల సమాజం తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
కాగా, కావేరీ నిరసన సభలో త్రిషను ఉద్దేశించి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. త్రిష (actor Trisha)ను ఉద్దేశించి ద్వంద్వార్థం వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సీఎం విజయ్ (CM Vijay) నిన్న తీవ్రంగా స్పందించారు. భావప్రకటనా స్వేచ్ఛను ఏ విధంగా ఉపయోగిస్తున్నామనే దానిపై మనం ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రజలను ముఖ్యంగా మహిళలను కించరిచేలా మాట్లాడకూడదని సూచించారు. కొందరు మాట్లాడుతున్న డబుల్ మీనింగ్ మాటలను ప్రజలు గమనిస్తున్నారంటూ ఉదయనిధి పేరును ప్రస్తావించకుండానే సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు.
"కొందరు డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మన ఇంట్లో తల్లి, చెల్లి, అక్క ఉన్నారని ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. మహిళలను అవమానిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు" అని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత గతంలో ఎదుర్కొన్న అవమానాలను సీఎం విజయ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా త్రిష వివాదాన్సి ఉదాహరణగా చెప్పారు. కాగా, 2021లో వచ్చిన 'తలైవి' బయోపిక్ చిత్రంలో జయలలిత పాత్రలో కంగనా నటించిన విషయం తెలిసిందే.
Also Read..
గాయపడిన చిరుతను కాపాడేందుకు వెళ్లగా.. అధికారులపై దాడి.. షాకింగ్ వీడియో
ఎయిర్ హోస్టెస్, ఫ్రీ వైఫై.. విమానాన్ని తలపించే ఆర్టీసీ బస్సు.. ఎక్కడో తెలుసా..?
ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Vijay | మహిళలను కించపరిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు.. ఉదయనిధి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
సెప్టెంబర్ 7, 2026

Kangana Ranaut | పనికిమాలిన మాటలు వద్దు.. మీ వల్లే నా పనితీరుపై విమర్శలు.. మండి అధికారులపై కంగన ఆగ్రహం
సెప్టెంబర్ 5, 2026

Vijay for PM | ప్రధాని అభ్యర్థిగా విజయ్.. కాంగ్రెస్తో విభేదాల వేళ సెప్టెంబర్ 9న కూటమి పక్షాలతో టీవీకే భేటీ!
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Kanohar Electricals IPO | కనోహర్ ఎలక్ట్రికల్స్ ఐపీవోకు విశేష స్పందన.. 31 శాతం లాభం అంచనా..
- ●MLA Veerlapalli Shankar | కేసీఆర్ చనిపోవాలి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు
- ●Leopard | గాయపడిన చిరుతను కాపాడేందుకు వెళ్లగా.. అధికారులపై దాడి.. షాకింగ్ వీడియో
- ●Vakiti Srihari | ఇప్పటికీ పెత్తందార్ల పోకడలు కొనసాగడం దురదృష్టకరం: మంత్రి వాకిటి శ్రీహరి
- ●Paytm | చాట్జీపీటీలోనే పేటీఎం పేమెంట్స్.. ఇక చెల్లింపుల వివరాలు క్షణాల్లో..
- ●KSRTC | ఎయిర్ హోస్టెస్, ఫ్రీ వైఫై.. విమానాన్ని తలపించే ఆర్టీసీ బస్సు.. ఎక్కడో తెలుసా..?

Kanohar Electricals IPO | కనోహర్ ఎలక్ట్రికల్స్ ఐపీవోకు విశేష స్పందన.. 31 శాతం లాభం అంచనా..

MLA Veerlapalli Shankar | కేసీఆర్ చనిపోవాలి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు

Leopard | గాయపడిన చిరుతను కాపాడేందుకు వెళ్లగా.. అధికారులపై దాడి.. షాకింగ్ వీడియో

Vakiti Srihari | ఇప్పటికీ పెత్తందార్ల పోకడలు కొనసాగడం దురదృష్టకరం: మంత్రి వాకిటి శ్రీహరి



