Manne Krishank | ఇసుక తవ్వకాల ఆదాయంపై తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వ గణాంకాలు: మన్నె క్రిశాంక్
Manne Krishank | రాష్ట్రంలో ఇసుక తవ్వకాల (Sand Mining) ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ (Manne Krishank) విమర్శించారు.
Manne Krishank | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఇసుక తవ్వకాల (Sand Mining) ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ (Manne Krishank) విమర్శించారు. ఇసుక తవ్వకాల ఆదాయంపై ముఖ్యమంత్రి సీపీఆర్వో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రం ఏర్పడక ముందు (2014కు ముందు) కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం రూ.39 కోట్లు. కానీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలతో ఇసుక ఆదాయం గణనీయంగా పెరిగి, ఒక్క ఏడాదిలోనే రూ.886 కోట్లకు చేరింన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇసుక ధర టన్నుకు రూ.645 మాత్రమే ఉండగా, ప్రజలకు అందుబాటులో ఉంచిందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సాండ్ బజార్ పేరుతో ఇసుక ధరను టన్నుకు రూ.1600కు పెంచిందని విమర్శించారు. అదనంగా రవాణా భారం కూడా ప్రజలపై మోపుతున్నదని విమర్శించారు.
సర్విస్ చార్జీలు టన్నుకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3 నుంచి రూ.100కు పెంచినప్పటికీ, ఆదాయం మాత్రం పెరగకపోవడం అనుమానాస్పదం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఇసుక తవ్వకాలు జరగగా, ఇప్పుడు పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు తవ్వకాలు, 24 గంటల రవాణా అనుమతించినప్పటికీ ఆదాయం రెట్టింపు కాలేదన్నారు. ఈ పరిస్థితి చూస్తే ఇసుక ఆదాయం సాండ్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోతుందనే అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా, ప్రస్తుత ముఖ్యమంత్రి కార్యాలయ సీపీఆర్వోగా ఉన్న గుర్రం మల్సూర్ గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో టీఎస్‌ఎండీసీ (TSMDC) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారన్నారు. కాబట్టి, ఆయనకు వాస్తవ గణాంకాలు బాగా తెలుసన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గత బీఆర్‌ఎస్ సర్కార్ విజయాలను వక్రీకరించి, తప్పుడు గణాంకాలతో ప్రజలను మోసం చేస్తున్నదనే విషయంపై సీపీఆర్వో మల్సూర్ వెంటనే స్పష్టత ఇవ్వాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఇసుక తవ్వకాల ఆదాయంపై పారదర్శకత కోసం పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించాలన్నారు. తెలంగాణ ప్రజలపై భారం మోపుతూ, వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వాన్ని నడపడం సరికాదని విమర్శించారు. నిజాలు బయటపెట్టాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తుందని వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



