Uttamkumar Reddy | సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పథకానికి NOC ఇవ్వండి
Uttamkumar Reddy | సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పథకానికి ఎన్‌వోసీ ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేశ్ సాయిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య సమన్వయంతో ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తమ్ తెలిపారు.
- పార్క్ హయత్ భేటీలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయికి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విజ్ఞప్తి
- రాష్ట్ర నీటిపారుదల ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం
Uttamkumar Reddy | త్రినేత్ర.న్యూస్: సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పథకానికి ఎన్‌వోసీ ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేశ్ సాయిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. పార్క్ హయత్‌లో శుక్రవారం ఆయనతో కలిసి మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఈ పథకంపై సమగ్రంగా చర్చించారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య సమన్వయంతో ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి ప్రభుత్వం తరఫున వినతి పత్రం అందజేశారు.
అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. సమ్మక్క-సారక్క ఎత్తిపోతల అనుమతుల సాధనకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఉత్తర తెలంగాణ రైతాంగానికి సాగునీటి భద్రత కల్పించడంలో ఈ ప్రాజెక్టు కీలకంగా ఉంటుందన్నారు. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర అంశాల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం దౌత్యపరమైన చొరవగా ఆయన అభివర్ణించారు.
ప్రాజెక్టు అనుమతుల విషయంలో సానుకూల స్పందన ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని కోరినట్లు వివరించారు. రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న అనుమతులను త్వరితగతిన సాధించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
అంతకుముందు గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు.
సంబంధిత వార్తలు

TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
జులై 28, 2026

Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
జులై 27, 2026

Rajeev Sagar | హైకోర్టు తీర్పు ప్రభుత్వ వైఫల్యానికి చెంపపెట్టు.. ఇండ్లు కూల్చడం పాలన అనిపించుకోదు
జులై 27, 2026
తాజావార్తలు
- ●TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
- ●South Central Railway | 16 గంటలు రైలు ఆలస్యం.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 25 వేల జరిమానా
- ●Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?
- ●Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
- ●Horoscope | జూలై 28 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక లాభాలు..!
- ●Morning Phone Habit | పొద్దున్నే లేవగానే మొబైల్ చూస్తున్నారా? ఇది అడిక్షన్ కాదట.. అసలు నిజం తెలిస్తే షాకవుతారు!

TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు

South Central Railway | 16 గంటలు రైలు ఆలస్యం.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 25 వేల జరిమానా

Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?

Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత



