Chhattisgarh | “రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి”.. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ
Chhattisgarh | రోడ్లు వేయలేకపోతే మాకు హెలికాప్టర్లు అయినా ఇవ్వండి అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)కు ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) గిరిజనులు వినూత్న (tribal residents) లేఖ రాశారు. తమ ప్రాంతంలో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిని షా దృష్టికి తీసుకెళ్లేందుకు వారు ఈ విధంగా లేఖ పంపారు.
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం సుక్మా జిల్లాకు (Sukma district) చెందిన ఓ గిరిజన గ్రామ ప్రజలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)కు ఓ వినూత్న లేఖ రాశారు. "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి" అంటూ అందులో అభ్యర్థించారు. తమ ప్రాంతంలో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిని షా దృష్టికి తీసుకెళ్లేందుకు వారు ఈ విధంగా లేఖ పంపారు. సుక్మా జిల్లాలోని మరుకి గ్రామ ప్రజలు చేసిన ఈ అభ్యర్థన సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
గ్రామస్థుల కథనం ప్రకారం.. మారుకి గ్రామాన్ని (Maruki village) అనుసంధానించే రోడ్డు గత పదేళ్లుగా అసంపూర్తిగానే నిలిచిపోయింది. కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద గుంతలు తవ్వి, వంతెనలు, కల్వర్టుల నిర్మాణ పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. దీంతో ఆ రహదారి మొత్తం రాళ్లు తేలి, గుంతలమయంగా మారిపోయింది. ఆ మార్గంలో ప్రయాణం నరకయాతనగా మారింది. వర్షాకాలం, ముఖ్యంగా అత్యవసర వైద్య సమయాల్లో పరిస్థితి దారుణంగా ఉంటోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీలు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లు కూడా రావడం లేదని, వారిని ప్రధాన రహదారి వరకూ తీసుకెళ్లేందుకు డోలీ కట్టి కిలోమీటర్ల మేర మోసుకెళ్లాల్సి వస్తోందని వాపోయారు.
ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు జిల్లా యంత్రాంగానికి విన్నవించినట్లు గ్రామస్థులు తెలిపారు. అయినా ప్రతీసారీ కేవలం హామీలు మాత్రమే ఇస్తున్నారని.. క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులూ జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం తమకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. లేదంటే అత్యవసర సమయాల్లో తాము ప్రయాణించడానికి వీలుగా కనీసం ఓ హెలికాప్టర్ అయినా ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.
తాజావార్తలు
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..
- ●RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..
- ●Lava SHARK 2 5G | రూ.11,999కే లావా షార్క్ 2 5జీ.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ.. ఏఐ కెమెరా..
- ●Zaheerabad Farmers | జహీరాబాద్ రైతుల వినూత్న ప్రయత్నం.. 130 రకాల పంటలు సాగు..!
- ●Preity Mukhundhan | విజయ్ దేవరకొండతో స్టెప్పులేయనున్న మలయాళ బ్యూటీ - రౌడీ జనార్దనలో స్పెషల్ సాంగ్!
- ●AIADMK MLA | అన్నాడీఎంకేలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం.. నాలుగో ఎమ్మెల్యే కూడా..

WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..

RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..

Lava SHARK 2 5G | రూ.11,999కే లావా షార్క్ 2 5జీ.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ.. ఏఐ కెమెరా..

Zaheerabad Farmers | జహీరాబాద్ రైతుల వినూత్న ప్రయత్నం.. 130 రకాల పంటలు సాగు..!






