Vinod Kumar | రేవంత్ రెడ్డికి మేడిగడ్డనే దిక్కు : మాజీ ఎంపీ వినోద్
Vinod Kumar | మేడిగడ్డ కొట్టుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి చూశారు కానీ.. చివరకు ఆ మేడిగడ్డనే ఆయనకు దిక్కు అవుతుందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే రేవంత్ రెడ్డికి ఆప్షన్ అన్నారు. అందుకే మేడిగడ్డకు సీఎం మరమ్మతులు చేపట్టాడని వినోద్ కుమార్ తెలిపారు.
Vinod Kumar | త్రినేత్ర.న్యూస్ : మేడిగడ్డ కొట్టుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి చూశారు కానీ.. చివరకు ఆ మేడిగడ్డనే ఆయనకు దిక్కు అవుతుందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే రేవంత్ రెడ్డికి ఆప్షన్ అన్నారు. అందుకే మేడిగడ్డకు సీఎం మరమ్మతులు చేపట్టాడని వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మాజీ ఎంపీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు నేను అడ్డు పడితే రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. తుమ్మిడిహెట్టి ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును మాజీ సీఎం వైఎస్ఆర్ ప్రతిపాదించారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పింది. నాటి మహారాష్ట్ర కాంగ్రెస్ సీఎం పృథ్వి రాజ్ చవాన్, ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసి 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టికి అనుమతి ఇవ్వమని చెప్పారు. ఆ సమయంలో కేంద్రంలో, మహారాష్ట్రలో, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరిని మోసం చేద్దామని అనుకుంటున్నారని వినోద్ కుమార్ ధ్వజమెత్తారు.
ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నేనే పోరాటం చేశాను
కేసీఆర్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎంత బ్రతిమిలాడినా ఒప్పుకోలేదు. ముంబైలో ఐదు రోజులు వుండి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేశాం. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నేనే పోరాటం చేశాను. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను అని ఫడ్నవీస్ చెప్పారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎంకు లెటర్ రాయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అంటున్నారు. మహారాష్ట్ర సీఎంతో ఘర్షణ పూరితంగా రేవంత్ రెడ్డి ఎట్లా వెళ్తారు అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.
ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ ఇవ్వరని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు..
తుమ్మిడిహెట్టిని మొదట వ్యతిరేకించింది మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఏడాది క్రితం బండి సంజయ్ ఆరు నెలల్లో పర్మిషన్ తెస్తాను అన్నారు. ఇప్పటి వరకు గతి లేదు. ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ ఇవ్వరని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కాంగ్రెస్,బీజేపీ డ్రామాలు బంద్ చేయాలి అని వినోద్ కుమార్ హెచ్చరించారు.
ఈ ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జడ్పీ మాజీ చైర్మన్ ధపెరాజు రాజు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా వైద్యులు ఏమన్నారంటే..?
జులై 28, 2026

RTC Employees save a girl | 10 రూపాయల నోటుతో బస్సెక్కిన బాలిక.. కదలికలు చూసి కాపాడిన డ్రైవర్, కండక్టర్
జులై 28, 2026

Minister Ponguleti | భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణంలో రీ-సర్వే కీలక ఘట్టం
జులై 28, 2026
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా వైద్యులు ఏమన్నారంటే..?
- ●Jayam Ravi | జయం రవి భార్యకు షాకిచ్చిన కోర్టు - విడాకుల కేసులో కోలీవుడ్ హీరోకు ఊరట
- ●RTC Employees save a girl | 10 రూపాయల నోటుతో బస్సెక్కిన బాలిక.. కదలికలు చూసి కాపాడిన డ్రైవర్, కండక్టర్
- ●Minister Ponguleti | భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణంలో రీ-సర్వే కీలక ఘట్టం
- ●International Tiger Day | దేశంలో పులులు 3,682
- ●CM Revanth Reddy | హైడ్రాపై వెనక్కి తగ్గం.. మరింత బలోపేతం చేస్తాం

Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా వైద్యులు ఏమన్నారంటే..?

Jayam Ravi | జయం రవి భార్యకు షాకిచ్చిన కోర్టు - విడాకుల కేసులో కోలీవుడ్ హీరోకు ఊరట

RTC Employees save a girl | 10 రూపాయల నోటుతో బస్సెక్కిన బాలిక.. కదలికలు చూసి కాపాడిన డ్రైవర్, కండక్టర్

Minister Ponguleti | భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణంలో రీ-సర్వే కీలక ఘట్టం



