త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Parliament Monsoon Session | నీట్ మంట‌లు.. ఉభ‌య‌స‌భ‌లు మ‌ళ్లీ వాయిదా.. మ‌ధ్యాహ్నం లోక్‌స‌భ‌లో పేప‌ర్ లీక్ బిల్లుపై చ‌ర్చ‌

Parliament Monsoon Session | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు (Parliament Monsoon Session) వ‌రుస‌గా ఏడో రోజూ ప్రారంభ‌మైన నిమిషాల్లోనే వాయిదా ప‌డ్డాయి. నీట్ పేప‌ర్ లీక్‌ను నిర‌సిస్తూ ఆందోళ‌న తెలుపుతున్న విద్యార్థుల‌పై పోలీసులు బ‌ల‌ప్ర‌యోగానికి పాల్ప‌డ్డారంటూ విప‌క్ష ఎంపీలు ఆరోపించారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విప‌క్ష ఎంపీల నిర‌స‌న‌ల‌తో ఉభ‌య‌స‌భ‌లు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కూ వాయిదా ప‌డ్డాయి.

D

National | Published On Jul 28, 2026, 12.02 pm IST

Parliament Monsoon Session | నీట్ మంట‌లు.. ఉభ‌య‌స‌భ‌లు మ‌ళ్లీ వాయిదా.. మ‌ధ్యాహ్నం లోక్‌స‌భ‌లో పేప‌ర్ లీక్ బిల్లుపై చ‌ర్చ‌
Advertisement

Parliament Monsoon Session | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు (Parliament Monsoon Session) వ‌రుస‌గా ఏడో రోజూ ప్రారంభ‌మైన నిమిషాల్లోనే వాయిదా ప‌డ్డాయి. ఉద‌యం 11 గంట‌ల‌కు లోక్‌స‌భ (Lok Sabha) ప్రారంభ‌మైంది. పేపర్ లీకేజీల క‌ట్ట‌డికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత కీలకమైన యాంటీ పేప‌ర్ లీక్ బిల్లుపై (Anti Paper Leak Bill) చ‌ర్చ‌కు అంతా స‌హ‌క‌రించాల‌ని స్పీక‌ర్ ఓంబిర్లా (Speaker Om Birla) స‌భ్యుల‌ను కోరారు. అయితే, విద్యార్థుల‌పై జ‌రిగిన లాఠీఛార్జ్‌పై చ‌ర్చ‌కు విప‌క్ష ఎంపీలు ప‌ట్టుబ‌ట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేయ‌డం స‌భ‌లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి త‌లెత్తింది. దీంతో స‌భ‌ను స్పీక‌ర్ ఓం బిర్లా మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కూ వాయిదా వేశారు. ఆ త‌ర్వాత యాంటీ పేప‌ర్ లీక్ బిల్లుపై చ‌ర్చ చేప‌ట్ట‌నున్నారు. ఈ బిల్లుపై చ‌ర్చ‌కు 8 గంట‌ల స‌మ‌యం కేటాయించారు. చ‌ర్చ అనంత‌రం ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు.

అటు రాజ్య‌స‌భ (Rajya Sabha)లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. నీట్ పేప‌ర్ లీక్‌ను నిర‌సిస్తూ ఆందోళ‌న తెలుపుతున్న విద్యార్థుల‌పై పోలీసులు బ‌ల‌ప్ర‌యోగానికి పాల్ప‌డ్డారంటూ విప‌క్ష ఎంపీలు ఆరోపించారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యంగా వామ‌ప‌క్ష పార్టీల‌కు చెందిన ప్ర‌తిప‌క్ష ఎంపీలు ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స‌భ‌కు వ‌చ్చి ప్ర‌క‌ట‌న చేయాల‌ని డిమాండ్ చేశారు. అయితే, అధికారప‌క్ష ఎంపీలు మాత్రం ఈ డిమాండ్‌ను తిప్పికొట్టాయి. వెంట‌నే క‌లుగ‌చేసుకున్న చైర్మ‌న్ సీపీ రాధాకృష్ణ‌న్ జీరో అవ‌ర్ ప్ర‌స్తావ‌న‌ల‌ను చేప‌ట్టాల‌ని కోరిన‌ప్ప‌టికీ.. గంద‌ర‌గోళం కొన‌సాగ‌డంతో ఆయ‌న స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కూ వాయిదా వేశారు.

చ‌ట్టంలోని కీల‌క స‌వ‌ర‌ణ‌లు ఇవే..

దేశవ్యాప్తంగా జ‌రిగే నీట్‌, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026' (యాంటీ పేపర్ లీక్ బిల్లు)ను సోమ‌వారం పార్లమెంటు ముందుకు తెచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే అమల్లో ఉన్న 2024 చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ ఈ ముసాయిదాను రూపొందించారు. ఈ బిల్లులో కేంద్రం కీల‌క మార్పులకు ప్ర‌తిపాదించింది. ఈ తరహా కేసులను వేగంగా విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

లీకేజీలు, అవకతవకలకు పాల్పడే వ్యక్తులకు విధించే గరిష్ఠ జైలు శిక్షను ఐదేళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. నిందితులకు విధించే గరిష్ఠ జరిమానాను రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచారు. వ్య‌వ‌స్థీకృత నేరాల‌కు క‌నీసం ఏడేళ్ల జైలు శిక్ష‌, రూ.10 కోట్ల జ‌రిమానా ప‌డుతుంది. అక్రమాలకు పాల్పడే సర్వీస్ ప్రొవైడర్లు లేదా ప్రైవేట్ పరీక్షా ఏజెన్సీలకు రూ. 5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు ఎనిమిదేళ్ల పాటూ పరీక్షలు నిర్వహించకుండా నిషేధం విధిస్తారు. ఆయా కేసుల్లో ఛార్జిషీట్ దాఖ‌లు చేసిన మూడు నెల‌ల్లోనే విచార‌ణ పూర్తి చేయాల‌ని ప్ర‌తిపాదించారు. ఈ కేసుల విచారణ కోసం అవ‌స‌ర‌మైతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ప్రత్యేక దర్యాప్తు చేపట్టనుంది.

Also Read..

ప్ర‌ధాని మోదీ సెల్ఫీ వీడియో తొల‌గింపు.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మెటా

అమ‌ర్‌నాథ్ యాత్రికుల బ‌స్సు బోల్తా.. 39 మందికి గాయాలు

ఫ్లాట్‌గా కొన‌సాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్ల‌లో కొనుగోళ్లు..

Advertisement
Advertisement