Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు
Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న (Amarnath Yatra pilgrims) బస్సు జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లోని గందర్‌బాల్ (Ganderbal) జిల్లాలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 39 మంది యాత్రికులు గాయపడ్డారు.
Amarnath Yatra | పవిత్ర అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న (Amarnath Yatra pilgrims) బస్సు ప్రమాదానికి గురైంది. జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లోని గందర్‌బాల్ (Ganderbal) జిల్లాలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో యాత్రికులు గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పలువురు యాత్రికులు అమర్‌నాథ్ గుహలో పూజలు ముగించుకొని బస్సులో తిరుగు పయనమయ్యారు. కంగన్ ప్రాంతంలోని ఓ మూల మలుపు వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఓ ఇంటిపై బోల్తా పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఆ ఇంటికి భారీ నష్టం వాటిల్లినప్పటికీ.. బస్సు సింధు నదిలోకి పడకుండా ఆ ఇల్లు అడ్డుకుంది. ఈ ఘటనలో 39 మంది యాత్రికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు.
Also Read..
ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..
విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్
టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
తాజావార్తలు
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ

Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం

S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు






