Badrinath Dham | బద్రీనాథ్‌లో విరాళాల స్వాహా.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
Badrinath Dham | ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ధామ్ (Badrinath Dham)లో విరాళాల చోరీపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.
Badrinath Dham | త్రినేత్ర.న్యూస్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ధామ్ (Badrinath Dham)లో ఆర్థిక అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఆలయ విరాళాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు, అక్రమాలపై నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ఆలయంలో అక్రమాలపై దర్యాప్తు చేయడం సహా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకురావాల్సిన చర్యలపై బద్రీనాథ్ కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ (BKTC)కి పలు సూచనలు చేయనుంది. ఇదిలా ఉండగా.. భక్తులు సమర్పించుకున్న కానుకలను స్వాహా చేశాడన్న ఆరోపణలతో ఓ ఉద్యోగిని టెంపుల్ కమిటీ ఇప్పటికే సస్పెండ్ చేసింది. ప్రాథమిక విచారణలో అక్రమాలకు పాల్పడినట్టు సాక్ష్యాధారాలు లభించడంతో ప్రమోద్ నౌట్యాల్ అనే ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు బీకేటీసీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు.
Also Read..
ప్రధాని మోదీకి 35 అంతర్జాతీయ పురస్కారాలు: ఏ దేశం నుంచి ఏ అవార్డు వచ్చిందంటే?
"మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్‌కౌంటర్‌లో లష్కరే టాప్ కమాండర్ హతం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jairam Ramesh | ట్రిపుల్ ఇంజిన్ పాలనలో.. ఓట్ చోరీ, సీట్ చోరీ, డొనేషన్ చోరీ : జైరాం రమేష్
జులై 4, 2026

Badrinath Dham | బద్రీనాథ్ ధామ్‌లోనూ కానుకల దుర్వినియోగం ఆరోపణలు.. విచారణకు ఆదేశం
జులై 4, 2026

Char Dham Yatra | చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. వర్షాకాలం నేపథ్యంలో ఆలయ కమిటీ కీలక విజ్ఞప్తి
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



