Priyank Kharge | ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు వచ్చినప్పుడల్లా ప్రధాని విదేశాలకు వెళ్తారు : ప్రియాంక్ ఖర్గే
Priyank Kharge | రామ మందిరం విరాళాల దుర్వినియోగం (Ram Mandir Donation Row) ఆరోపణల బాధ్యతను బీజేపీనే తీసుకోవాలని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) అన్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా ప్రధాని మోదీ (PM Modi) విదేశాలకు వెళ్తారని ఎద్దేవా చేశారు.
Priyank Kharge | రామ మందిరం విరాళాల దుర్వినియోగం (Ram Mandir Donation Row)పై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. శంకుస్థాపన, ధ్వజారోహణ, ప్రారంభోత్సవాలకు క్రెడిట్ తీసుకున్న బీజేపీ ప్రభుత్వం.. చందా చోరీ ఆరోపణలకు కూడా బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు వచ్చినప్పుడల్లా ప్రధాని విదేశాలకు వెళ్లిపోతుంటారని ఎద్దేవా చేశారు.
బెంగళూరులో విలేకరులతో ప్రియాంక్ ఖర్గే మాట్లాడారు. "రామమందిరం అంశంపై సుప్రీంకోర్టు తీర్పుకు బీజేపీ క్రెడిట్ తీసుకుంది. శంకుస్థాపనకు, ధ్వజారోహణకు, ప్రాణప్రతిష్ఠకు కూడా క్రెడిట్ తీసుకుంది. మరి అలాంటప్పుడు ఈ చందా చోరీ (విరాళాల దొంగతనం)కి కూడా వారే బాధ్యత వహించాలి కదా..? బీజేపీకి దేశం ముఖ్యంకాదు.. విరాళాలే ముఖ్యం. చోరీకి గురైన డబ్బు ఎక్కడికిపోయింది..? ఆలయ ట్రస్టు ఎందుకు రాజీనామా చేసింది..? రాజీనామా చేసిన తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా..? ప్రధాని మోదీ మరోసారి విదేశాలకు వెళ్లారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా ఆయన విదేశాలకు వెళ్తారు" అంటూ ప్రియాంక్ ఖర్గే తీవ్ర స్థాయిలో విమర్శించారు.
#WATCH | Bengaluru, Karnataka: On the Ram Mandir donation embezzlement case, Karnataka Minister Priyank Kharge says, “…If you have taken credit for the Supreme Court ruling, if you have taken credit for the foundation, if you have taken credit for the Pran Pratishtha… you… pic.twitter.com/RJBMBpb68f
— ANI (@ANI) July 8, 2026
Also Read..
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రివార్డుల్లో కోత.. కారణాలేంటి..?
జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..
సంబంధిత వార్తలు

Seva Pakhwada | మోదీ సిల్వర్ జూబ్లీ వేళ.. దేశవ్యాప్తంగా బీజేపీ సేవా పఖ్వాడా
ఆగస్టు 22, 2026

Modi Chalisa | జై జై మోదీ.. హర హర మోదీ.. ఢిల్లీ ప్రెస్ క్లబ్లో మోదీ చాలీసా విడుదల
ఆగస్టు 20, 2026

Cabinet Decisions | రూ. 9,450 కోట్ల భారీ రైల్వే విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. ఏపీకి దక్కిన ప్రాధాన్యం
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి
- ●SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..
- ●Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి

SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్



