Jaggareddy | హరీశ్‌రావు.. ఖమ్మం జిల్లా కొట్టుకుపోయినా పర్వాలేదా..? : జగ్గారెడ్డి
Jaggareddy | కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీళ్లు ఆపితే.. ఖమ్మం జిల్లా కొట్టుకుపోతదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు చెప్పారని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. మరి నీళ్లు నిల్వ ఉంచాలని హరీశ్‌రావు అంటున్నారు.. ఖమ్మం జిల్లా కొట్టుకుపోయిన పర్వాలేదా..? అని జగ్గారెడ్డి నిలదీశారు.
Jaggareddy | త్రినేత్ర.న్యూస్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీళ్లు ఆపితే.. ఖమ్మం జిల్లా కొట్టుకుపోతదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు చెప్పారని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. మరి నీళ్లు నిల్వ ఉంచాలని హరీశ్‌రావు అంటున్నారు.. ఖమ్మం జిల్లా కొట్టుకుపోయిన పర్వాలేదా..? అని జగ్గారెడ్డి నిలదీశారు. గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాజకీయంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. హరీశ్‌రావును కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నాను. తెలంగాణ ప్రజలు, రైతులంటే ఆయనకే ప్రేమ ఉన్నట్టు.. రేవంత్, ఉత్తమ్ ఏం చేస్తలేనట్టు పదేపదే మీడియాతో మాట్లాడుతున్నాడు హరీశ్‌రావు. అసెంబ్లీలో కాళేశ్వరంపై చప్పుడు చేయరు. కేసీఆర్ అసెంబ్లీ రావాలని రేవంత్ రెడ్డి కోరారు. కానీ ఆయన రారు. హరీశ్‌రావు వస్తాడు కానీ మాట్లడరు. మీడియాలో ఇవాళ మాట్లాడుతున్న వాటిపై అసెంబ్లీలో చర్చించరు. ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
బాధ్యుడు హరీశ్‌రావు అవుతాడా..? కాంగ్రెస్ ప్రభుత్వం అవుతదా..?
కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ మినిస్టర్ నువ్వే కదా..? కేసీఆర్ సీఎం. ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచి.. రాత్రిపూట డ్యామ్ వద్ద పడుకున్నావ్.. సెక్యూరిటీ కూడా లేదు.. ఇది డ్రామా కాదా.. నాటకం కాదా..? నీ అంత పనిమంతుడు లేడని చూయించుకున్నవ్. మరి మేడిగడ్డ కూలిపోయింది కదా..? అప్పుడేం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ అక్కడికి రాలేదు కదా..? నువ్వు ఇరిగేషన్ మినిస్టర్వి.. ప్రాజెక్టు కూలిపోతే.. బాధ్యుడు హరీశ్‌రావు అవుతాడా..? కాంగ్రెస్ ప్రభుత్వం అవుతదా.. జవాబు చెప్పాలి అని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
ఓ పద్ధతి అంటూ లేదా..? జవాబుదారీగా మాట్లాడరా..?
సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్‌రావు కట్టిన డ్యామే కూలిపోయింది.. ప్రజలు ఆలోచన చేయాలి. మేస్త్రీవి, కూలీవి, శాఖ మంత్రివి నువ్వే.. సిమెంట్, ఇసుక కలిపింది నువ్వే.. బేస్‌మెంట్ సైజులు చూసింది నువ్వే.. గేట్లు కొనుకొచ్చింది నువ్వే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డిని అంటే ఇదేం లెక్క.. ఇదేం పద్ధతి.. మీడియా రాస్తది ప్రజలు వింటారు కదా ఇదేనా.. ఓ పద్ధతి అంటూ లేదా..? జవాబుదారీగా మాట్లాడరా..? పదేపదే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం సరికాదు అని జగ్గారెడ్డి అన్నారు.
అసలు నిన్ను ఇరిగేషన్ మినిస్టర్‌గా ఎందుకు కేసీఆర్ తొలగించారు..?
అసలు నిన్ను ఇరిగేషన్ మినిస్టర్‌గా ఎందుకు కేసీఆర్ తొలగించారు. ఎందుకు ఆ శాఖ నుంచి తప్పించిండు జవాబు చెప్పాలి. మా అనుమానం ఏంటంటే.. కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు చేశావని గ్రహించి.. హరీశ్‌రావును కేసీఆర్ తొలగించి, తప్పును సరిదిద్దుకునే ప్రక్రియ చేపట్టినట్టు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
నీళ్లు నిల్వ ఉంచితే డ్యామ్ కొట్టుకుపోతది..
డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది..? మేడిగడ్డ కూలిపోయిన తర్వాత మీరు అక్కడ నీళ్లు నిల్వ ఉంచొద్దు అని చెప్పింది. నీళ్లు నిల్వ ఉంచితే డ్యామ్ కొట్టుకుపోతది.. ఖమ్మం, భద్రాచలం కొట్టుకుపోతదని చెప్పింది. మరి సీఎం, ఉత్తమ్ ఏం చేయాలి..? ఖమ్మం జిల్లా కొట్టుకుపోయినా పర్వాలేదా.. ఇదేనా హరీశ్‌రావు ఆలోచనా చెప్పాలి. నేషనల్ డ్యామ్ అథారిటీ నిపుణుల సూచనలు పాటించాలి.. ఖమ్మం జిల్లా ప్రజలను కాపాడుకోవాలి కదా.. వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని నీళ్లు ఆపడం లేదు.. దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి అని జగ్గారెడ్డి సూచించారు.
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





