Hardeep Singh Nijjar | ట్రూడోకు షాక్.. నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం లేదన్న కెనడా
Hardeep Singh Nijjar | ఖలిస్థానీ తీవ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో భారత అధికారుల ప్రమేయం ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలూ లేవని కెనడా పోలీసులు ప్రకటించారు. ఈ ప్రకటనతో కెనడా (Canada) మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) భారత్‌పై చేసిన ఆరోపణలు అసత్యాలని తేలిపోయింది.
International | Published On Jul 8, 2026, 4.15 pm IST
Hardeep Singh Nijjar | త్రినేత్ర.న్యూస్ : ఖలిస్థానీ తీవ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య ఘటన కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భారత అధికారుల ప్రమేయం ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలూ లేవని కెనడా పోలీసులు ప్రకటించారు. ఈ ప్రకటనతో కెనడా (Canada) మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) భారత్‌పై చేసిన ఆరోపణలు అసత్యాలని తేలిపోయింది.
అదే సమయంలో నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్లపై అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతడి సహచరుడు గోల్డీబ్రార్‌పై అమెరికాలో కేసు నమోదైంది. నిజ్జర్‌ను హత్యచేయాలని వారి నుంచి ఆదేశాలు అందాయని అమెరికా దర్యాప్తు అధికారులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. అమెరికా అభియోగాలు మోపిన కొన్ని గంటలకే కెనడా పోలీసుల నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
భారత ప్రభుత్వం ‘వాంటెడ్ టెర్రరిస్ట్’ గా ప్రకటించిన ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani terrorist) హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలోగల గురుద్వార వెలుపల దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో హర్దీప్ మరణించాడు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ సభ్యులకు కార్యకలాపాల నిర్వహణ, నెట్ వర్క్ ఏర్పాటు చేయడం, శిక్షణ, ఆర్థిక సహకారం వంటివి హర్దీప్ చేసేవాడు. పలు భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న హర్దీప్‌ను కేంద్ర ప్రభుత్వం 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.
ఇవీ ఆరోపణలు..
ఇక నిజ్జర్ హత్య ఘటన నేపథ్యంలో అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతు తారాస్థాయికి చేరాయి. ఈ ఆరోపణలు దౌత్య యుద్ధానికి దారి తీశాయి. నిజ్జర్ హత్యకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కుట్ర పన్నారని, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్ర కూడా ఉందంటూ కెనడాకు చెందిన జాతీయ భద్రతా అధికారి ఒకరు సంచలన ఆరోపణలు చేశారు.
Also Read..
బద్రీనాథ్‌లో విరాళాల స్వాహా.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..






