త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi International Awards | ప్రధాని మోదీకి 35 అంతర్జాతీయ పురస్కారాలు: ఏ దేశం నుంచి ఏ అవార్డు వచ్చిందంటే?

ప్రధాని నరేంద్ర మోదీ ఖాతాలో మరో అరుదైన రికార్డు. విదేశాల నుంచి 35 అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ఏకైక భారతీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారు.

J

National | Published On Jul 8, 2026, 3.31 pm IST

PM Modi International Awards | ప్రధాని మోదీకి 35 అంతర్జాతీయ పురస్కారాలు: ఏ దేశం నుంచి ఏ అవార్డు వచ్చిందంటే?
Advertisement
  • 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నరేంద్ర మోదీకి ఇప్పటివరకు 35 అంతర్జాతీయ పురస్కారాలు
  • ఇటీవల జూలై 7, 2026న ఇండోనేషియా ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారమైన "బింతాంగ్ ఆదిపూర్ణ"ను మోదీకి ప్రదానం
  • దీనిలో 28 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు, 4 అంతర్జాతీయ సంస్థల అవార్డులు, 3 సైనిక/ప్రత్యేక పతకాలు
  • సీషెల్స్ దేశపు ప్రతిష్టాత్మక "గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజాన్" అవార్డును అందుకున్న తొలి వ్యక్తిగా మోదీ సరికొత్త రికార్డు

PM Modi International Awards | త్రినేత్ర.న్యూస్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకున్నారు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన గ్లోబల్ లీడర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కేవలం దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రపంచ దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలతో (Highest Civilian Awards) మోదీని సత్కరిస్తున్నాయి.

తాజాగా జూలై 7, 2026న ఇండోనేషియా ప్రభుత్వం ప్రధాని మోదీకి తమ దేశపు అత్యున్నత అవార్డు అయిన "బింతాంగ్ ఆదిపూర్ణ"ను ప్రదానం చేసింది. దీంతో ఆయన అందుకున్న మొత్తం అంతర్జాతీయ అవార్డుల సంఖ్య 35కు చేరుకుంది. భారతదేశ చరిత్రలో ఏ ప్రధాని కూడా ఇన్ని గ్లోబల్ గౌరవాలు (Global Honours) అందుకోలేదు.

అవార్డుల విభజన (మొత్తం 35)

విదేశీ ప్రభుత్వాల పురస్కారాలు: 28 (వివిధ దేశాల అత్యున్నత పౌర సత్కారాలు)

అంతర్జాతీయ సంస్థల అవార్డులు: 4 (UN, ఫౌండేషన్స్ అందించినవి)

సైనిక, ప్రత్యేక మెడల్స్: 3

ప్రపంచవ్యాప్తంగా వివిధ ఖండాల వారీగా ప్రధాని మోదీ అందుకున్న ప్రధాన పురస్కారాల పూర్తి జాబితా ఇదే

ఆసియా అండ్ మిడిల్ ఈస్ట్ దేశాలు

ఇండోనేషియా (2026): బింతాంగ్ ఆదిపూర్ణ (తాజా పురస్కారం)

ఒమన్ (2025): ఆర్డర్ ఆఫ్ ఒమన్

భూటాన్ (2024): ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో

రష్యా (2019): ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్

UAE (2019): ఆర్డర్ ఆఫ్ జాయెద్

పాలస్తీనా (2018): గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా

ఆఫ్ఘనిస్తాన్ (2016): స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్

సౌదీ అరేబియా (2016): ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్

ఇతర దేశాలు: ఇజ్రాయెల్ - మెడల్ ఆఫ్ ది క్నెస్సెట్ (2026), బహ్రెయిన్, మాల్దీవులు (2019).

యూరప్ దేశాలు

స్లోవేకియా (2026): ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్

నార్వే (2026): నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్

స్వీడన్ (2026): ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్

ఫ్రాన్స్ అండ్ గ్రీస్ (2023): గ్రాండ్ క్రాస్ అవార్డులు

అమెరికా, ఆఫ్రికా, ఇతర దేశాలు

అమెరికా, ఆఫ్రికా దేశాలు సైతం మోదీ దార్శనికతకు పెద్దపీట వేశాయి.

బ్రెజిల్, నమీబియా, ఇథియోపియా (2025): ఆయా దేశాల అత్యున్నత జాతీయ అవార్డులు

ఈజిప్ట్ (2023): ఆర్డర్ ఆఫ్ ది నైల్

అమెరికా (2020): లెజియన్ ఆఫ్ మెరిట్ (సాయుధ దళాల పురస్కారం)

పసిఫిక్ దేశాలు (2023): పాపువా న్యూ గినియా, ఫిజీ, పలావు దేశాలు కూడా తమ అత్యున్నత సత్కారాలను అందజేశాయి.

సీషెల్స్: చరిత్ర సృష్టించిన తొలి వ్యక్తి మోదీ

ఈ జాబితాలో అత్యంత ప్రత్యేకమైనది సీషెల్స్ (Seychelles) అందించిన "గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్" పురస్కారం. సీషెల్స్ చరిత్రలోనే ఈ అత్యున్నత జాతీయ పౌర పురస్కారాన్ని ఒకరికి ఇవ్వడం ఇదే తొలిసారి. పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ క్లైమేట్ యాక్షన్, బ్లూ ఎకానమీ (సముద్ర వనరుల సుస్థిర అభివృద్ధి) కోసం మోదీ చేస్తున్న విశేష కృషికి గాను సీషెల్స్ అధ్యక్షుడు డా.ప్యాట్రిక్ హెర్మిని ఈ అవార్డును ప్రదానం చేశారు.

Advertisement
Advertisement