త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jairam Ramesh | ట్రిపుల్ ఇంజిన్ పాల‌న‌లో.. ఓట్ చోరీ, సీట్ చోరీ, డొనేష‌న్ చోరీ : జైరాం రమేష్

Jairam Ramesh | "ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం" పాల‌న‌లో దేశంలో "వోట్ చోరీ, సీట్ చోరీ, డొనేషన్ చోరీ" (vote theft, seat theft, donation theft) జరుగుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ (Jairam Ramesh) ఆరోపించారు.

D

National | Published On Jul 4, 2026, 1.36 pm IST

Jairam Ramesh | ట్రిపుల్ ఇంజిన్ పాల‌న‌లో.. ఓట్ చోరీ, సీట్ చోరీ, డొనేష‌న్ చోరీ : జైరాం రమేష్
Advertisement

Jairam Ramesh | కేంద్ర ప్ర‌భుత్వం, ఎన్నిక‌ల సంఘం (Election Commission)పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ (Jairam Ramesh) తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నిక‌ల సంఘం ఓట్లు, సీట్ల దొంగ‌త‌నానికి స‌హ‌క‌రిస్తోంద‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ ప్ర‌క్రియ‌పై, ఆ సంస్థ ఏక‌ప‌క్ష ప‌నితీరుపై ఇండీ కూట‌మి భార‌త ప్ర‌ధాన న్య‌యామూర్తికి రాసిన లేఖ కొన్ని నిర్ధిష్ట ఆందోళ‌న‌ల‌ను లెవ‌నెత్తింద‌ని చెప్పారు.

న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో జైరాం ర‌మేష్ మాట్లాడారు. "ఎన్నిక‌ల ఫ‌లితాలు ముందే ఫిక్స్ అవుతున్నాయ‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు. మ‌న రాజ్యాంగం, ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ ప్ర‌మాదంలో ఉన్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఫ‌లితాల‌ను ముందే నిర్ణ‌యిస్తే.. ఇక ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏముంటుంది..?" అని ప్ర‌శ్నించారు. ప్ర‌ధాన‌ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ల‌క్ష్యంగా చేసుకుని జైరాం ర‌మేష్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న‌కు క‌ప‌ట‌త్వం అనే జ‌బ్బు సోకిన‌ట్లు అనిపిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌శ్చిమ బెంగాల్‌, బీహార్‌, మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానాలో ఆయ‌న వ్య‌వ‌హార శైలి చూస్తే.. కేంద్ర హోం మంత్రి, ప్ర‌ధాన మంత్రి ఆదేశాల మేర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌నిచేస్తోంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని ఆరోపించారు.

చోరీల ప్ర‌భుత్వం..

అయోధ్య రామాల‌య విరాళాల దుర్వినియోగంపై కూడా జైరాం ర‌మేష్ స్పందించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ స‌ర్కార్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అది ట్రిపుల్ ఇంజిన్ స‌ర్కార్ (Triple-engine govt) కాద‌ని.. చోరీల ప్ర‌భుత్వం అంటూ విమ‌ర్శించారు. "ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం" పాల‌న‌లో దేశంలో "వోట్ చోరీ, సీట్ చోరీ, డొనేషన్ చోరీ" (vote theft, seat theft, donation theft) జరుగుతోందని ఆరోపించారు.

Advertisement
Advertisement