Encounter | “మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు”.. ఎన్‌కౌంటర్‌లో లష్కరే టాప్ కమాండర్ హతం
Encounter | షోపియాన్ (Shopian) జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్, లష్కరే తోయిబా (LeT) ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ (Zakir Ganai) హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌ను జమ్ము కశ్మీర్ పోలీసులు ఎక్స్ వేదికగా ధృవీకరించారు. "మీరు పారిపోవచ్చేమో.. కానీ దాక్కోలేరు" అంటూ ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు చేశారు.
Encounter | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir) ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. షోపియాన్ (Shopian) జిల్లాలో గత ఐదు రోజులుగా సాగుతున్న హై-వోల్టేజ్ 'కౌంటర్ టెర్రరిజమ్' ఆపరేషన్ (Encounter)లో మోస్ట్ వాంటెడ్, లష్కరే తోయిబా (LeT) ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ (Zakir Ganai) హతమయ్యాడు. ఎన్‌కౌంటర్‌లో జాకీర్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
షోపియాన్‌లోని పండ్ల తోటల మధ్య జాకీర్‌తోపాటూ మరో ఇద్దరు ఉగ్రవాదులు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో జులై 3న రికార్డయ్యాయి. అప్రమత్తమైన జమ్ము కశ్మీర్ పోలీసులు ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ దళాలతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. దట్టమైన తోటల గుండా ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఉండేందుకు ఆర్మీకి చెందిన స్పెషల్ విభాగానికి చెందిన 'విక్టర్ ఫోర్స్' (Victor Force) రంగంలోకి దిగింది. తోటల నుంచి బయటకు వెళ్లే దారులన్నింటినీ పూర్తిగా బ్లాక్ చేసింది. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా దళాలు నాలుగు రోజులపాటూ ఉగ్రవాదుల కోసం వేట కొనసాగించాయి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడపట్టాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదులు నక్కి ఉన్న చోటుకు భద్రతా దళాలు చేరుకుంటుండగా.. అప్రమత్తమైన టెర్రరిస్ట్‌లు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగింది. అనంతరం ఘటనాస్థలి నుంచి ఒక మృతదేహాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అతడు లష్కరే టాప్ కమాండర్ జాకీర్ గనాయ్‌గా గుర్తించారు. అతడికి గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌ను జమ్ము కశ్మీర్ పోలీసులు ఎక్స్ వేదికగా ధృవీకరించారు. "మీరు పారిపోవచ్చేమో.. కానీ దాక్కోలేరు" అంటూ ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు చేశారు.
You Can Run But You Can't Hide !
One Lashkar terrorist neutralised by SOG Shopian, in a Jt Op, along with RR and CRPF.
— J&K Police (@JmuKmrPolice) July 8, 2026
Also Read..
ఇండోనేషియాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. విశేషాలు తెలుసా..?
ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..
7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..
సంబంధిత వార్తలు

Encounter | 11 ఏళ్ల బాలికపై హత్యాచారం.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
జులై 8, 2026

Cloudburst | కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్.. బురదలో కూరుకుపోయిన పలు వాహనాలు.. VIDEO
జులై 6, 2026

Bharti Airtel | అమర్నాథ్ యాత్ర మార్గాల్లో ఎయిర్టెల్ ఫుల్ సిగ్నల్.. నెట్‌వర్క్‌ను విస్తరించిన సంస్థ..
జులై 3, 2026
తాజావార్తలు
- ●Credit Cards Rewards | క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రివార్డుల్లో కోత.. కారణాలేంటి..?
- ●Meta | ఇన్స్టాగ్రామ్ ప్రకటనలపై మెటా వివరణ.. చిన్నారుల భద్రత కోసం కోట్ల అకౌంట్లపై చర్యలు..
- ●Joint Home Loan | జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..
- ●Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు
- ●Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం
- ●Prambanan Temple | ఇండోనేషియాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. విశేషాలు తెలుసా..?

Credit Cards Rewards | క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రివార్డుల్లో కోత.. కారణాలేంటి..?

Meta | ఇన్స్టాగ్రామ్ ప్రకటనలపై మెటా వివరణ.. చిన్నారుల భద్రత కోసం కోట్ల అకౌంట్లపై చర్యలు..

Joint Home Loan | జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..

Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు



