Char Dham Yatra | చార్‌ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. వర్షాకాలం నేపథ్యంలో ఆలయ కమిటీ కీలక విజ్ఞప్తి
Char Dham Yatra | ప్రసిద్ధ చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) కీలక విజ్ఞప్తి చేసింది.
Char Dham Yatra | ప్రసిద్ధ చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 30 లక్షల మందికిపైగా భక్తులు (Pilgrims) చార్ ధామ్ యాత్రను చేపట్టారు. ముఖ్యంగా ఈ యాత్రలో భాగంగా బద్రీనాథ్, కేదార్‌నాథ్ థామ్‌లకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 1,050,670 మంది భక్తులు కేదార్‌నాథ్ ధామ్ (Kedarnath Dham)ను సందర్శించి బాబా కేదార్‌కు ప్రత్యేక పూజలు చేశారు. అటు బద్రీనాథ్ ధామ్ (Badrinath Dham)ని కూడా సుమారు 832,903 మంది విజిట్ చేశారు. బద్రీ విశాల్ భగవానుడి (శ్రీమహావిష్ణువు)ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రెండు ఆలయాల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) కీలక విజ్ఞప్తి చేసింది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని యాత్రకు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తోంది. తమ రిజిస్ట్రేషన్‌ను ముందుగానే పూర్తి చేసుకోవాలని, ఆ ప్రాంతంలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉన్నందున తగినంత వెచ్చని దుస్తులను వెంట తెచ్చుకోవాలని, వసతికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ ముందుగానే చేసుకోవాలని సూచించింది. ముఖ్యంగా యాత్రను ప్రారంభించే ముందు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పింది.
కాగా, చార్‌ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 19న తెరిచారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలు వరుసగా ఏప్రిల్ 22, 23 తేదీల్లో భక్తుల కోసం తెరిచారు. ఇక, గతేడాది 50 లక్షల మందికి పైగా భక్తులు చార్ ధామ్ యాత్ర చేశారు.
#WATCH | Rudraprayag, Uttarakhand | Devotees throng Badrinath and Kedarnath Dham for darshan. Long queues seen at both shrines.
As per the latest pilgrimage figures, 1,050,670 devotees have visited Kedarnath Dham and offered prayers to Baba Kedar so far, while 832,903 pilgrims… pic.twitter.com/eFRovFZnzB
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 4, 2026
Also Read..
ట్రంప్‌కు గట్టి షాక్.. ఇరాన్‌పై సైనిక చర్యను నిలిపివేసే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. స్వల్పంగా తగ్గిన చమురు ధరలు..
ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైన అమీర్‌ఖాన్..! ఎవరీ గౌరీ..?
సంబంధిత వార్తలు

Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణనాథుడు.. నేడు భక్తుల సంఖ్య లక్ష దాటేనా..?
సెప్టెంబర్ 15, 2026

Harish Rawat | ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్.. పదవుల నుంచి తప్పుకున్న మాజీ సీఎం
సెప్టెంబర్ 12, 2026

Tapt Kund | బద్రీనాథ్‌లో విషాదం.. తప్త్ కుండ్‌లో స్నానమాచరిస్తూ అక్కాచెల్లెళ్లు మృతి
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
- ●Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
- ●TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!

Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!

TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి

Operation Polo | విలీనం.. 78 ఏళ్లు



