Ponguleti | ప్రజలపై బీఆర్ఎస్ రూ.8.5 లక్షల కోట్ల అప్పుభారం.. రెండేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు : పొంగులేటి
Ponguleti Srinivasa Reddy | గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలపై రూ.8.5 లక్షల కోట్ల అప్పు మోపితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో పేదలకు ఎనిమిది లక్షల ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు 2.50 లక్షల ఇళ్లు, సీయూఆర్ (CUR) పరిధిలో మరో లక్ష ఇళ్లతో కలిపి మొత్తం ఎనిమిది లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని వివరించారు.
Ponguleti Srinivasa Reddy | గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలపై రూ.8.5 లక్షల కోట్ల అప్పు మోపితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో పేదలకు ఎనిమిది లక్షల ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు 2.50 లక్షల ఇళ్లు, సీయూఆర్ (CUR) పరిధిలో మరో లక్ష ఇళ్లతో కలిపి మొత్తం ఎనిమిది లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని వివరించారు. వనపర్తి, గద్వాల జిల్లాల్లో బుధవారం సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, కృష్ణారెడ్డిలతో కలిసి తహశీల్దార్ కార్యాలయ భవనం, వెంకటేశ్వర ఆలయాలకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొంగులేటి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా ప్రజలను మోసగించకుండా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఒక్క రూపాయి లంచం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
తొలి విడతలో మంజూరైన ఇళ్లలో ఇప్పటికే 1.35 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు పూర్తయ్యాయని, మరో 1.25 లక్షల ఇళ్లు శ్లాబ్ దశను పూర్తి చేసుకున్నాయని చెప్పారు. మిగిలిన ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1,500 ఇళ్లతో పాటు పూరి గుడిసెల స్థానంలో పక్కా ఇళ్ల నిర్మాణం కోసం అదనంగా 500 ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాగుతున్న ప్రగతిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై పడి విషం చిమ్ముతున్నారని, మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 10న ఖమ్మం జిల్లాలో రైతులకు రూ.9,300 కోట్ల విడుదలకు సంబంధించిన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. నాడు "వరి వేస్తే ఉరి" అన్న కేసీఆర్ మాటలకు భిన్నంగా నేడు "రైతే రాజు" అనే నినాదంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
గతంలో వనపర్తిని దత్తత తీసుకుంటానని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని పేర్కొంటూ, పట్టణంలో ప్రెస్ క్లబ్ భవనంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు 32 వేల పూరి గుడిసెలను గుర్తించామని, వనపర్తి నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె కూడా లేకుండా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్న పేదలకు ఇసుక, మట్టి సేకరణ విషయంలో ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని పోలీసు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. సాదాబైనామా భూముల విషయంలో రైతు వాస్తవంగా పొజిషన్‌లో ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేయాలని, అవసరమైతే సీసీఎల్‌ఏ అనుమతి తీసుకుని ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





