Badrinath Dham | బద్రీనాథ్ ధామ్‌లోనూ కానుకల దుర్వినియోగం ఆరోపణలు.. విచారణకు ఆదేశం
Badrinath Dham | ఆలయాల్లో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే అయోధ్య వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో ప్రముఖ క్షేత్రంలోనూ ఇలాంటి ఆరోపణలే రావడం ఆందోళన కలిగిస్తోంది. బద్రీనాథ్ ధామ్ (Badrinath Dham)లో భక్తులు సమర్పించిన కానుకలను ఓ ఉద్యోగి స్వాహా చేశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆలయ కమిటీ విచారణకు ఆదేశించింది.
Badrinath Dham | అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తున్న వేళ.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ధామ్ (Badrinath Dham) లోనూ భక్తులు మసర్పించిన కానుల విషయంలో ఇలాంటి ఆరోపణలే రావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ ఆరోపణలపై బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ (BKTC) విచారణకు ఆదేశించింది.
భైరవ్ సేన ( Bhairav Sena) అనే సంస్థ బద్రీనాథ్ ధామ్‌లో ఆర్థిక అక్రమాలు జరిగాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఆలయ కమిటీ చైర్మన్ వద్ద పీఏగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి భక్తులు సమర్పించుకున్న కానుకలను స్వాహా చేసినట్లు పేర్కొంది. ఈ నిధుల దుర్వినియోగంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలపై బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది తీవ్రంగా ఖండించారు. ఆ వ్యక్తి తన పర్సనల్ సెక్రటరీ కాదని, బీకేటీసీలో సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అని తెలిపారు. గతంలో ముగ్గురు మాజీ ఆలయ కమిటీ చైర్మన్ల వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేశారని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాదు, ఈ ఆరోపణలను ఆలయ కమిటీ తీవ్రంగా పరిగణించిందని ద్వివేది తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించినట్లు చెప్పారు. విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. విచారణ పూర్తైన తర్వాత ఎవరైనా ఉద్యోగి దోషిగా తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించినట్లు ఆలయ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ సింగ్ రంగద్ తెలిపారు. చైర్మన్ ఆదేశాల మేరకు సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణ కోరినట్లు చెప్పారు. ఈ అంశం లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేదిలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధారాలు లేని, తప్పుదోవ పట్టించే ఆరోపణలు చేయొద్దని ఆయన హెచ్చరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jairam Ramesh | ట్రిపుల్ ఇంజిన్ పాలనలో.. ఓట్ చోరీ, సీట్ చోరీ, డొనేషన్ చోరీ : జైరాం రమేష్
జులై 4, 2026

Char Dham Yatra | చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. వర్షాకాలం నేపథ్యంలో ఆలయ కమిటీ కీలక విజ్ఞప్తి
జూన్ 4, 2026

Badrinath Dham | తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు
ఏప్రిల్ 23, 2026
తాజావార్తలు
- ●Jairam Ramesh | ట్రిపుల్ ఇంజిన్ పాలనలో.. ఓట్ చోరీ, సీట్ చోరీ, డొనేషన్ చోరీ : జైరాం రమేష్
- ●IBPS SO Recruitment | ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. డిగ్రీ, పీజీ చేసినవారు అర్హులు
- ●Flipkart GOAT Sale 2026 | ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ షురూ.. ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..
- ●Terrorists | ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. 23 మందిని టెర్రరిస్టులుగా ప్రకటించిన కేంద్రం
- ●CM Revanth Reddy | తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం.. సీఎం రేవంత్ భావోద్వేగ పోస్ట్
- ●Suicide attack on Pak Coast Guard | పాక్ కోస్ట్‌గార్డ్‌పై ఆత్మాహుతి దాడి.. 30 మంది దుర్మరణం!

Jairam Ramesh | ట్రిపుల్ ఇంజిన్ పాలనలో.. ఓట్ చోరీ, సీట్ చోరీ, డొనేషన్ చోరీ : జైరాం రమేష్

IBPS SO Recruitment | ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. డిగ్రీ, పీజీ చేసినవారు అర్హులు

Flipkart GOAT Sale 2026 | ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ షురూ.. ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..

Terrorists | ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. 23 మందిని టెర్రరిస్టులుగా ప్రకటించిన కేంద్రం



