త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air India | సౌదీ అరేబియాకు సర్వీసులు ర‌ద్దు.. మ‌రోసారి పొడిగించిన‌ ఎయిర్ ఇండియా

Air India | మ‌ధ్య‌ప్రాచ్యంలో నెలకొన్న‌ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు (Saudi Arabian) విమాన సర్వీసుల రద్దును ఎయిర్ ఇండియా (Air India) గ్రూప్ మరోసారి పొడిగించింది.

G

National | Published On Nov 14, 2026, 8.13 am IST

Air India | సౌదీ అరేబియాకు సర్వీసులు ర‌ద్దు.. మ‌రోసారి పొడిగించిన‌ ఎయిర్ ఇండియా
Advertisement

Air India | త్రినేత్ర న్యూస్‌: మ‌ధ్య‌ప్రాచ్యంలో నెలకొన్న‌ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు (Saudi Arabian) విమాన సర్వీసుల రద్దును ఎయిర్ ఇండియా (Air India) గ్రూప్ మరోసారి పొడిగించింది. రియాద్, దమ్మమ్‌ నగరాలకు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) సర్వీసులను ఈ నెల 30 వరకు ర‌ద్దు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. అదేవిధంగా జెడ్డాకు (Jeddah) సర్వీసులను ఈ నెల 21వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసింది. దీంతో నవంబర్‌ 10వ తేదీన, అంతకుముందు బుక్‌ చేసుకున్న ప్ర‌యాణికులకు ప్ర‌యాణ తేదీల‌ను మార్చుకునే (Rescheduling) స‌దుపాయం వ‌ర్తింప జేస్తామ‌ని లేదా టిక్కెట్‌ సొమ్ము వాపసు చేస్తామని తెలిపింది.

దీనిప్ర‌కారం రీషెడ్యూల్ చేసుకున్న‌ట్ల‌యితే రియాద్ (Riyadh), దమ్మామ్ (Dammam) ప్రయాణీకులు డిసెంబర్ 14 లోపు త‌మ ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకోవాల‌ని, అదేవిధంగా జెడ్డా ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని డిసెంబర్ 5 లోపు పూర్తి చేసుకోవాల‌ని సూచించింది. కాగా, మ‌రో విమాన‌యాన సంస్థ‌ ఇండిగో కూడా జెడ్డా, మదీనాలకు తమ విమాన సర్వీసుల రద్దును నవంబర్‌ 21వరకు పొడిగించిన విష‌యం తెలిసిందే. ఆకాశ సంస్థ సైతం రియాద్, జెడ్డాలకు నవంబర్ 30 వరకు సర్వీసుల రద్దును పొడిగించింది.

 

Advertisement
Advertisement