త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AFCAT | ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్.. డిసెంబర్ 11 వ‌రకు ద‌ర‌ఖాస్తులు

AFCAT | భార‌త వైమానిక ద‌ళంలో (Air Force) చేరాల‌నుకుంటున్నారా? అయితే మీకోసం మంచి అవ‌కాశం ఎదురుచూస్తున్న‌ది. ఫ్ల‌యింగ్‌, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్‌ టెక్నికల్) విభాగాల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT 01/2027) నోటిఫికేషన్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విడుద‌ల చేసింది.

G

National | Published On Nov 14, 2026, 6.38 am IST

AFCAT | ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్.. డిసెంబర్ 11 వ‌రకు ద‌ర‌ఖాస్తులు
Advertisement

AFCAT | త్రినేత్ర న్యూస్‌: భార‌త వైమానిక ద‌ళంలో (Air Force) చేరాల‌నుకుంటున్నారా? అయితే మీకోసం మంచి అవ‌కాశం ఎదురుచూస్తున్న‌ది. ఫ్ల‌యింగ్‌, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్‌ టెక్నికల్) విభాగాల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT 01/2027) నోటిఫికేషన్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విడుద‌ల చేసింది. మొత్తం 284 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ది. దీని ద్వారా పర్మనెంట్ కమిషన్ (PC), షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) అవకాశాలు కల్పిస్తున్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ చేసిన వారు అర్హులు. ఆస‌క్తి క‌లిగిన‌వారు డిసెంబర్ 11 వ‌రకు ఆన్‌లైన్‌లో afcat.edcil.co.in ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. 2027 జనవరి 31న పరీక్ష ఉంటుంది. ఈ కోర్సుల శిక్షణ జనవరి 2028లో ప్రారంభంకానుంది.

మొత్తం ఖాళీలు: 284

ఫ్లయింగ్ (Flying)- 36 పోస్టులు (షార్ట్ సర్వీస్ కమిషన్ - పురుషులు 28, మహిళలు 8)
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)- 124 పోస్టులు
* ఏరోనాటికల్ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్- AE(L): 88
* ఏరోనాటికల్ ఇంజినీర్ మెకానికల్- AE(M): 36

గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్): 108 పోస్టులు
వెపన్ సిస్టమ్స్ (WS): పురుషులు 25, మహిళలు 5
అడ్మినిస్ట్రేషన్ (Adm): పురుషులు 35, మహిళలు 18
లాజిస్టిక్స్ (Lgs): పురుషులు 7, మహిళలు 4
అకౌంట్స్ (Accts): పురుషులు 4, మహిళలు 4
ఎడ్యుకేషన్ (Edn): పురుషులు 2, మహిళలు 2
మెటియోరాలజీ (Met): పురుషులు 1, మహిళలు 1

NCC స్పెషల్ ఎంట్రీ: ఫ్లయింగ్ బ్రాంచ్‌లో సీడీఎస్‌ఈ ఖాళీల నుంచి 10 శాతం (పీసీ కోసం), ఏఎఫ్‌క్యాట్‌ ఖాళీల నుంచి 10 శాతం (ఎస్‌ఎస్‌సీ కోసం) కేటాయించారు.
GATE స్కోర్ ఎంట్రీ (గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్): 16
AE(L): పురుషులు 7 మహిళలు 4
AE(M): పురుషులు 3, మహిళలు 2

అర్హతలు: భారత పౌరులై ఉండాలి. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు 10+2లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదివి ఉండటంతోపాటు డిగ్రీ లేదా నాలుగేండ్ల‌ బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో నాలుగేండ్ల‌ డిగ్రీ లేదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న తత్సమాన అర్హతలు ఉండాలి. నాన్‌ టెక్నికల్ పోస్టులకు బ్రాంచ్‌ను బట్టి డిగ్రీ, పీజీ, బీకామ్, ఫైనాన్స్ సంబంధిత డిగ్రీలు తదితర అర్హతలు అవసరం. గేట్‌ స్కోర్ ఎంట్రీకి సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు అర్హత కలిగిన గేట్‌ స్కోర్ ఉండాలి. పూర్తి విద్యార్హతలు బ్రాంచ్‌ను బట్టి మారుతాయి.

వ‌య‌స్సు: ఫ్లయింగ్ బ్రాంచ్‌కు 2028, జనవరి 1 నాటికి 20- 24 ఏండ్ల‌ మధ్య ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్-టెక్నికల్)/గేట్‌ ఎంట్రీకి 20 నుంచి 26 ఏండ్ల‌ మధ్య ఉండాలి.

ఎంపిక విధానం

మొత్తం మూడు ప్రధాన దశల్లో ఉంటుంది. మొదట కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ రాత పరీక్ష (AFCAT) నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి +3 మార్కులు, తప్పు సమాధానానికి -1 నెగెటివ్ మార్కు ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను (లేదా ఎన్‌సీసీ, గేట్‌ ద్వారా నేరుగా ఎంపికైన వారిని) ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ (AFSB) పరీక్షలకు పిలుస్తారు. అక్కడ స్టేజ్-I (ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్ రేటింగ్ అండ్‌ పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్ అండ్ డిస్కషన్ టెస్ట్ నిర్వహిస్తారు.), స్టేజ్-II (సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టాస్క్‌లు, ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు.

ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ పరీక్ష ఉంటుంది. చివరగా వైద్య పరీక్షలు, మెరిట్ జాబితా ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ అభ్యర్థులకు రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. అర్హులైన వారికి నేరుగా ఏఎఫ్‌ఎస్‌బీ పరీక్ష నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
అప్లికేష‌న్‌ ఫీజు: రూ.550+జీఎస్‌టీ, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ, గేట్‌ స్కోర్ ఎంట్రీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబ‌ర్‌ 11
ఏఎఫ్‌క్యాట్‌ పరీక్ష: 2027 జ‌న‌వ‌రి 31
కోర్సు ప్రారంభం: జనవరి 2028
వెబ్‌సైట్‌: afcat.edcil.co.in.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు.. 

Advertisement
Advertisement