త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bombay High Court | నీ ఇష్టమొచ్చింది చేసుకోపో.. అన్నంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటారా? భర్తపై కేసు పెడతారా?

Bombay High Court | గొడ‌వ‌ల స‌మ‌యంలో కోపంతో “నీకు ఇష్ట‌మొచ్చింది చేసుకోపో” (Do Whatever You Want) అన్నంత మాత్రాన ఆత్మ‌హ‌త్య‌కు (Suicide) ప్రేరేపించిన‌ట్లు కాద‌ని బాంబే హైకోర్టు (Bombay High Court) స్ప‌ష్టం చేసింది. ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించాడ‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓ వ్య‌క్తికి బెయిల్ మంజూరు చేసింది.

D

National | Published On Nov 12, 2026, 3.28 pm IST

Bombay High Court | నీ ఇష్టమొచ్చింది చేసుకోపో.. అన్నంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటారా? భర్తపై కేసు పెడతారా?
Advertisement

Bombay High Court | త్రినేత్ర న్యూస్ : గొడ‌వ‌ల స‌మ‌యంలో కోపంతో “నీకు ఇష్ట‌మొచ్చింది చేసుకోపో” (Do Whatever You Want) అన్నంత మాత్రాన ఆత్మ‌హ‌త్య‌కు (Suicide) ప్రేరేపించిన‌ట్లు కాద‌ని బాంబే హైకోర్టు (Bombay High Court) స్ప‌ష్టం చేసింది. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిరూపించాలంటే, బాధితురాలిని ఆత్మహత్య చేసుకునేలా ఉద్దేశపూర్వకంగా, ప్రత్యక్షంగా ప్రేరేపించే చర్య ఉండాలని నొక్కి చెప్పింది. ఈ మేర‌కు భార్య‌ను ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించాడ‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓ వ్య‌క్తికి బెయిల్ మంజూరు చేసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

37 ఏళ్ల లెక్చరర్ అభిజిత్ దిలీప్ గరాడ్ అనే వ్య‌క్తికి 2025 జులైలో వివాహం జ‌రిగింది. తొలుత త‌న అత్తింటివారితో క‌లిసి నివ‌సించాడు. ఆ త‌ర్వాత దంప‌తులిద్ద‌రూ కొత్త ప్లాట్‌కు మారారు. అయితే, వీరి మ‌ధ్య క‌ల‌హాలు వ‌చ్చాయి. సెప్టెంబర్ 13న భార్యాభర్తల మధ్య చిన్న పాటి గొడ‌వ‌ జరిగింది. తన మాట వినకపోతే ఆత్మహత్య చేసుకుంటానని భార్య అన‌డంతో కోపంలో ఉన్న భ‌ర్త “నువ్వు ఏం కావాలంటే అది చేసుకో” అని చెప్పి తన సోదరుడిని చూసేందుకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత భార్య తన మేనమామతో అత్తమామల వేధింపుల గురించి మాట్లాడి ఆత్మహత్య చేసుకుంది.

దీంతో మ‌హిళ కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు భ‌ర్త‌, అత్త‌మామ‌ల‌పై పూణేలోని చందన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు న‌మోదైంది. ఈ కేసును జస్టిస్ మిలింద్ ఎన్. జాదవ్ నేతృత్వంలోని ధర్మాసనం విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. “నువ్వు ఏం కావాలంటే అది చేసుకో” అని అనడం ప్రాథమికంగా ఆత్మహత్యకు ప్రేరేపణ (instigation) కిందకు రాదని కోర్టు స్పష్టం చేసింది. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిరూపించాలంటే, బాధితురాలిని ఆత్మహత్య చేసుకునేలా ఉద్దేశపూర్వకంగా, ప్రత్యక్షంగా ప్రేరేపించే చర్య ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. కేవలం గొడవకు ప్రతిస్పందనగా అన్న మాటలు ఈ పరిధిలోకి రావని తెలిపింది. పిటిషనర్ ఎలాంటి బలప్రయోగం, హింస, దుర్భాషలాడటం లేదా డబ్బు, వస్తువుల డిమాండ్ చేసిన దాఖలాలు లేవని కోర్టు నొక్కిచెప్పింది. అంత‌మాత్రాన భ‌ర్త‌పై కేసు పెడ‌తారా..? అని నిల‌దీశింది.

అదేవిధంగా ఉద్యోగ బాధ్యతల వల్ల భార్యతో తగినంత సమయం గడపలేకపోవడం లేదా బయటకు తీసుకెళ్లలేకపోవడం అనేది కేవలం వైవాహిక కలహాల (marital discord) కిందకు వస్తుంది తప్ప, అది దానంతట అదే క్రూరత్వం (cruelty) కాదని పేర్కొంది. పిటిషనర్ వృత్తిరీత్యా లెక్చరర్ కాబట్టి ఆయనకు తగినంత సమయం ఉండకపోవడం సహజమేనని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేర‌కు క‌స్ట‌డీలో విచార‌ణ అవ‌స‌రం లేద‌ని తేల్చి కోర్టు.. పిటిష‌న‌ర్‌కు బెయిల్ మంజూరు చేసింది.

Also Read..

భార‌తీయ వీసాల ప్ర‌క్రియ మ‌రింత సుల‌భ‌త‌రం.. కేటగిరీల సంఖ్య 13 నుంచి 9కి కుదింపు

విదేశీ విడాకులు భార‌త్‌లో చెల్ల‌వు.. ఎన్నారైల‌కు సుప్రీం బిగ్ షాక్‌

22ఏ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి

Advertisement
Advertisement