త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vikarabad | ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఉరివేసి.. తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న త‌ల్లి..

Vikarabad | వికారాబాద్‌ జిల్లా (Vikarabad) ధారూర్‌ మండలం చింతకుంటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమారులకు ఉరివేసిన తల్లి తానూ ఆత్మహత్య (Suicide) చేసుకుంది.

G

Telangana | Published On Nov 1, 2026, 8.26 am IST

Vikarabad | ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఉరివేసి.. తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న త‌ల్లి..
Advertisement

Vikarabad | త్రినేత్ర న్యూస్‌: వికారాబాద్‌ జిల్లా (Vikarabad) ధారూర్‌ మండలం చింతకుంటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమారులకు ఉరివేసిన తల్లి తానూ ఆత్మహత్య (Suicide) చేసుకుంది. చింతకుంటకు చెందిన భూపతిరెడ్డి, వాస‌వి (33) దంప‌తుల‌కు స‌హ‌ర్ష రెడ్డి (8), వేదార్షరెడ్డి (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భూప‌తి రెడ్డి పోలీసు శాఖలో పనిచేస్తున్నారు. పిల్లల చదువుల కోసం వికారాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

ఆదివారం సెలవు కావడంతో స్వగ్రామంలో గడిపేందుకు భూపతిరెడ్డి.. భార్యాబిడ్డలతో క‌లిసి శనివారం కారులో చింతకుంటకు తీసుకెళ్లారు. వారిని ఇంటి వద్ద దించి ఆయన తాండూరుకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం వేళ ఇంట్లో ఒంటరిగా ఉన్న వాసవి.. బయట ఆడుకుంటున్న ఇద్దరు కుమారులను లోపలికి పిలిచింది. అనంతరం బెడ్‌రూమ్‌లో ఇద్దరు పిల్లలకు ఉరివేసి, మరో గదిలో తానూ ఆత్మహత్య చేసుకుంది. గుర్తించిన వాసవి మామ సాయిరెడ్డి.. భూపతిరెడ్డికి సమాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. వాసవి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు న‌మోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్:

DharurMotherSuicideVikarabad
Advertisement
Advertisement