Nvidia | మా బాస్ మాకు కావల్సిందే.. జెన్సన్ హువాంగ్‌కు మద్దతుగా ఉద్యోగుల ర్యాలీ..
Nvidia | ఎన్‌విడియా సీఈఓ పదవికి జెన్సన్ హువాంగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో కంపెనీ ఉద్యోగులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. అంతర్గత సూచనల వేదికలో 1,600 మందికి పైగా ఉద్యోగులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా, ఎక్కువ మంది ఆయనను తిరిగి సీఈఓగా నియమించాలని బోర్డును కోరుతున్నారు. రాజీనామా వెనుక ఉన్న పరిణామాలపై పారదర్శకత ఉండాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
Nvidia | ఎన్‌విడియా సీఈఓ పదవికి జెన్సన్ హువాంగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో కంపెనీ ఉద్యోగులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. అంతర్గత సూచనల వేదికలో 1,600 మందికి పైగా ఉద్యోగులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా, ఎక్కువ మంది ఆయనను తిరిగి సీఈఓగా నియమించాలని బోర్డును కోరుతున్నారు. రాజీనామా వెనుక ఉన్న పరిణామాలపై పారదర్శకత ఉండాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
1600 మందికి పైగా ఉద్యోగుల మద్దతు..
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్‌విడియాలో జెన్సన్ హువాంగ్ రాజీనామా వ్యవహారం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన తిరిగి కంపెనీ సీఈఓ బాధ్యతలు చేపట్టాలని కోరుతూ 1,600 మందికి పైగా ఉద్యోగులు అంతర్గతంగా తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు వైర్డ్ కథనం పేర్కొంది. హువాంగ్ రాజీనామాకు ముందు సంస్థలోని ఒక సీనియర్ ఇంజినీర్ ఈ అంశాన్ని ఉద్యోగుల సూచనల విభాగంలో ప్రస్తావించారు. సీఈఓపై నిర్ణయం తీసుకునే ముందు ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, బోర్డు నిర్వహిస్తున్న విచారణ వివరాలను సిబ్బందికి తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ఆయనను తిరిగి తీసుకురావాలని వ్యాఖ్యానించారు. కంపెనీకి ఎంతో సేవ చేసిన నాయకుడికి మద్దతు ఇవ్వడం అంటే ఆయన తప్పులు చేయరని భావించడం కాదని, న్యాయం కోరుతూ నాయకుడికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని మరో ఉద్యోగి కంపెనీ అంతటా పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. హువాంగ్‌కు మద్దతుగా సుమారు రెండు డజన్ల మంది ఉద్యోగులు లింక్డ్‌ఇన్‌లోనూ పోస్టులు చేశారు.
రాజీనామాకు దారితీసిన పరిణామాలు..
1993లో ఎన్‌విడియాను సహవ్యవస్థాపకుడిగా ప్రారంభించిన 63 ఏళ్ల జెన్సన్ హువాంగ్, అప్పటి నుంచి సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. తన భార్యకు తాను నమ్మకద్రోహం చేశానని, అందుకు ఎలాంటి సమర్థన లేదని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో ఆయన అంగీకరించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. చైనాకు పనిచేస్తున్నారనే అనుమానాలు అమెరికా నిఘా అధికారులు వ్యక్తం చేసిన ఆలిస్ హువాంగ్‌తో సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. తనకు నేరుగా రిపోర్ట్ చేసే ఉద్యోగితో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో బోర్డు ఆయన రాజీనామాను ప్రకటించింది. అనంతరం మరో ఉద్యోగితోనూ సంబంధం ఉన్నట్లు రాయిటర్స్ కథనం ప్రచురించింది. అయితే హువాంగ్ స్వయంగా అంగీకరించిన అంశం మినహా మిగిలిన ఆరోపణలేవీ ఎన్‌విడియా అధికారికంగా ధ్రువీకరించలేదు.
బోర్డు నిర్ణయాలు.. కంపెనీపై ప్రభావం..
హువాంగ్ రాజీనామా అనంతరం కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కొలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈఓగా నియమించారు. సినాప్సిస్ మాజీ సీఈఓ జోన్స్‌ను బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. ఈ వివాదం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఎన్‌విడియా మార్కెట్ విలువలో ఒక ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లినట్లు మీడియా కథనాల్లో ప్రచురించారు. ఈ వ్యవహారంపై అమెరికా చట్టసభ సభ్యులు, ఎఫ్‌బీఐ విచారణలు ప్రారంభించడంతోపాటు చిప్ ఎగుమతులపై కొత్త ఆంక్షలు విధించే అవకాశాలు కూడా తెరపైకి వచ్చాయి. బోర్డు విచారణ పూర్తయిన తర్వాతే కీలక నిర్ణయం ఉంటుందని ఉద్యోగులు భావించినప్పటికీ, విచారణ ప్రారంభమైన సమయంలోనే హువాంగ్ వైదొలగడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!






