Miss Universe | మిస్ యూనివర్స్ పోటీలు.. 15 దేశాల అందెగత్తెలు ఔట్..!
Miss Universe | ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిస్ యూనివర్స్–2026 పోటీకి అనూహ్య ఆటంకాలు ఎదురవుతున్నాయి. నవంబర్ 24న జరగనున్న గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఏకంగా 15పైగా దేశాలు ఈసారి పోటీలో పాల్గొనడం లేదని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు, వీసా ఇబ్బందులతో కొందరు అభ్యర్థులు తప్పుకోగా.. ఫ్రాంచైజీ హక్కుల వివాదం కారణంగా ఆరు ఆసియా దేశాలు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
Miss Universe | ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిస్ యూనివర్స్–2026 పోటీకి అనూహ్య ఆటంకాలు ఎదురవుతున్నాయి. నవంబర్ 24న జరగనున్న గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఏకంగా 15పైగా దేశాలు ఈసారి పోటీలో పాల్గొనడం లేదని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు, వీసా ఇబ్బందులతో కొందరు అభ్యర్థులు తప్పుకోగా.. ఫ్రాంచైజీ హక్కుల వివాదం కారణంగా ఆరు ఆసియా దేశాలు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
75వ వార్షికోత్సవం.. ప్రత్యేక కిరీటం
మిస్ యూనివర్స్ పోటీకి ఈ ఏడాది మరో ప్రత్యేకత ఉంది. సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా అత్యంత ఆకర్షణీయమైన కిరీటాన్ని రూపొందించింది. 18 క్యారెట్ల వైట్‌గోల్డ్‌తో తయారు చేసిన ఈ కిరీటంలో ఏకంగా 3,150 వజ్రాలను పొదిగారు. ఇందులోని మూడు ప్రధాన వజ్రాలు మిస్ యూనివర్స్ గతం, వర్తమానం, భవిష్యత్తుకు ప్రతీకలుగా నిలుస్తాయని నిర్వాహకులు వెల్లడించారు. గతంలోనూ ఈ పోటీల్లో సుమారు 18 ప్రత్యేక కిరీటాలు అందుబాటులోకి వచ్చాయి.

వ్యక్తిగత కారణాలతో కొందరు ఔట్
ఆస్ట్రియా తరఫున పాల్గొనాల్సిన విక్టోరియా ఎమర్సన్ నవంబర్ 7న పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. బల్గేరియా ప్రతినిధి అనా-మరియా బబావు ఓ అనూహ్య ఘటన కారణంగా వైదొలిగినట్లు సమాచారం. సెయింట్ మార్టిన్ అభ్యర్థి మాడెలిన్ మారియన్ వ్యక్తిగత కారణాలతో పోటీకి దూరమయ్యారు. మాల్దీవులు, మొరాకో ప్రతినిధులు కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు.
వీసా చిక్కులతో మరికొందరికి నిరాశ
అందాల కిరీటం కోసం నెలల తరబడి సిద్ధమైనప్పటికీ కొందరు వీసా సమస్యలతో పోటీకి చేరుకోలేకపోతున్నారు. నేపాల్ ప్రతినిధి ప్రయాసనా గురుంగ్ వీసా సమస్యల కారణంగా పాల్గొనలేకపోతున్నట్లు వెల్లడించారు. జాంబియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దక్షిణ సూడాన్ ప్రతినిధులు కూడా అమెరికా వీసా పరిమితుల కారణంగా వైదొలిగినట్లు ప్రకటించారు. జింబాబ్వే ప్రతినిధి సైతం వీసా సమస్యలను వెల్లడిస్తూ వీడియో విడుదల చేశారు. అయితే ఆమె పోటీలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

ఆరు ఆసియా దేశాల్లో ఫ్రాంచైజీ వివాదం
మిస్ యూనివర్స్–2026లో మరో కీలక పరిణామం ఆరు ఆసియా దేశాలకు సంబంధించినది. జాతీయ ఫ్రాంచైజీ హక్కుల వివాదం కారణంగా థాయ్‌లాండ్, ఇండోనేషియా, వియత్నాం, లావోస్, సింగపూర్, మలేషియా దేశాల ప్రతినిధులు అంతర్జాతీయ పోటీలో పాల్గొనడం లేదని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఆయా దేశాల్లో విజేతలుగా నిలిచినవారు తమ జాతీయ టైటిళ్లను కొనసాగించనున్నట్లు సమాచారం.
భారత్ తరఫున కాజియా లిజ్ మెజో
ఈ సారి మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరఫున కేరళకు చెందిన కాజియా లిజ్ మెజో ప్రాతినిధ్యం వహించనున్నారు. నవంబర్ 24న ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో జోస్ మిగ్యుయెల్ అగ్రెలోట్ కొలీజియంలో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇన్ని దేశాల ప్రతినిధులు పోటీకి దూరమవుతున్న నేపథ్యంలో ఈసారి విశ్వసుందరి కిరీటం ఎవరిని వరిస్తుందన్న ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!





