త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Police Constable | లోన్‌ యాప్‌ వేధింపులు.. కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Police Constable | రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడలో విషాదం చోటుచేసుకుంది. లోన్‌ యాప్‌ (Loan App) నిర్వాహకుల వేధింపులు తాళ‌లేక ఓ కానిస్టేబుల్ (Police Constable) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

G

Telangana | Published On Nov 10, 2026, 11.46 am IST

Police Constable | లోన్‌ యాప్‌ వేధింపులు.. కానిస్టేబుల్‌ ఆత్మహత్య
Advertisement

Police Constable | త్రినేత్ర న్యూస్‌: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడలో విషాదం చోటుచేసుకుంది. లోన్‌ యాప్‌ (Loan App) నిర్వాహకుల వేధింపులు తాళ‌లేక ఓ కానిస్టేబుల్ (Police Constable) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హ‌ర్ష‌గూడ‌కు చెందిన ముడావత్ శ్రీను (31) 8వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వివిధ ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకున్నారు. అయితే గ‌త కొంత‌కాలంగా అప్పులు చెల్లించాలంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. దీంతో వేధింపులు భ‌రించ‌లేక శ్రీను ఉరివేసుకుని (Suicide) బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందారు చెందాడు. కాగా, మొబైల్‌కు మార్ఫింగ్ ఫొటోలు (Morphed Photographs) పంపి వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు కూడా శ్రీను పాల్పడినట్లు తెలుస్తున్న‌ది.

మృతుని తల్లి ఫిర్యాదుతో పహాడీషరీఫ్ పోలీసులు కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. లోన్ యాప్‌ల నిర్వాహకులు, వేధింపులకు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. మొబైల్ ఫోన్లు, మెసేజ్‌లు సహా డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement