spurious liquor | నాగాలాండ్‌లో కల్తీ మద్యం కలకలం.. 19 మంది మృతి
spurious liquor | ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ (Nagaland)లో కల్తీమద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం తాగి (spurious liquor) గత రెండు రోజుల్లోనే 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 1989 నుంచి ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉండటం గమనార్హం.
spurious liquor | త్రినేత్ర న్యూస్ : సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ (Nagaland)లో కల్తీమద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం (spurious liquor) తాగి గత రెండు రోజుల్లోనే 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తువెన్‌సాంగ్ (Tuensang) జిల్లాలో 11 మంది , మొకొక్‌చంగ్ (Mokokchung) జిల్లాలో 8 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా అనుమానాస్పద కల్తీ మద్యం సేవించడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనను నాగాలాండ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేసేందుకు అదనపు ఎస్పీ బుంగ్లాంగ్ చాంగ్ నేతృత్వంలో సిట్ (SIT) బృందాన్ని ఏర్పాటు చేసింది. కల్తీ మద్యం తయారీ, సరఫరాపై సిట్ దర్యాప్తు చేయనున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) వెసుప్రా కేజో తెలిపారు.
వరుస మరణాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 3,000 మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆయా ఘటనల్లో 19 మందిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా లేబుల్ లేని, అనుమానాస్పదంగా ఉన్న అక్రమ మద్యాన్ని ఎవరూ సేవించొద్దని పోలీసులు స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించిన తర్వాత తలతిరగడం, కంటి చూపు మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
కాగా, నాగాలాండ్ టోటల్ లిక్కర్ ప్రొహిబిషన్ (NLTP) చట్టం కింద రాష్ట్రంలో 1989 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో మద్యం తయారు చేయడం, నిల్వ ఉంచడం, విక్రయించడం, సేవించడం పూర్తిగా నిషేధం. అయితే, పొరుగు రాష్ట్రాలైన అస్సాం నుంచి పెద్ద ఎత్తున మద్యం అక్రమంగా నాగాలాండ్‌కు రవాణా అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దిమాపూర్ వంటి నగరాల్లో వందలాది అక్రమ బార్లు నడుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో NLTP చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని స్టూడెంట్స్ ఫెడరేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి.
Also Read..
బెంగళూరుకు వచ్చే ఎమ్మెల్యేలకు రెండు పెళ్లిళ్లు.. డీకే సంచలన వ్యాఖ్యలు
వారాంతంలో బులియన్ మార్కెట్లకు స్వల్ప ఊరట.. దేశీయంగా ప్రతికూల సంకేతాలు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telugu University | తెలుగు విశవ్విద్యాలయం-2026 ప్రతిభా పురస్కారాలు
- ●Two dies in Road Accident | ఔటర్‌పై పేలిన ట్రాలీ ఆటో టైరు.. ఇద్దరు కూలీలు దుర్మరణం
- ●Sanjay Kumar | పోలీసులు జోక్యం చేసుకోవాల్సిందే.. దేవుళ్ల దగ్గర రాజకీయ నాయకుల పాటలు ఎందుకు?: జగిత్యాల ఎమ్మెల్యే
- ●UNGA | పగలు ప్రపంచ శాంతి, రాత్రి ఉగ్రవాదం.. ఇదీ దాయాది కపట బుద్ధి.. ఐరాసలో పాక్ పీఎం ప్రసంగంపై భారత్ ఘాటు సమాధానం
- ●Google Gemini | గూగుల్ నుంచి కొత్త ఏఐ వాయిస్ మోడల్స్.. 100కు పైగా భాషల్లో వాయిస్ క్రియేషన్..
- ●Harish Rao | హరీశ్ లేఖతో కదిలిన ప్రభుత్వం.. అనంతగిరి, రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు

Telugu University | తెలుగు విశవ్విద్యాలయం-2026 ప్రతిభా పురస్కారాలు

Two dies in Road Accident | ఔటర్‌పై పేలిన ట్రాలీ ఆటో టైరు.. ఇద్దరు కూలీలు దుర్మరణం

Sanjay Kumar | పోలీసులు జోక్యం చేసుకోవాల్సిందే.. దేవుళ్ల దగ్గర రాజకీయ నాయకుల పాటలు ఎందుకు?: జగిత్యాల ఎమ్మెల్యే

UNGA | పగలు ప్రపంచ శాంతి, రాత్రి ఉగ్రవాదం.. ఇదీ దాయాది కపట బుద్ధి.. ఐరాసలో పాక్ పీఎం ప్రసంగంపై భారత్ ఘాటు సమాధానం






