Spurious Liquor | కల్తీ మద్యం కలకలం.. 15 మంది మృతి, 180 మందికి అస్వస్థత
Spurious Liquor | మణిపూర్‌లోని (Manipur) చందేల్ జిల్లాలో కల్తీ మద్యం (Spurious Liquor) కలకలం సృష్టిస్తున్నది. చక్ఫికరాంగ్ సబ్‌డివిజన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో గత మూడు రోజుల్లో కల్తీ మద్యం తాగి 15 మంది మృతిచెందారు. మరో 180 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు.
Spurious Liquor | త్రినేత్ర న్యూస్: మణిపూర్‌లోని (Manipur) చందేల్ జిల్లాలో కల్తీ మద్యం (Spurious Liquor) కలకలం సృష్టిస్తున్నది. చక్ఫికరాంగ్ సబ్‌డివిజన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో గత మూడు రోజుల్లో కల్తీ మద్యం తాగి 15 మంది మృతిచెందారు. మరో 180 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. మద్యం తాగిన వారంతా వాంతులు, కడుపునొప్పి, తలనొప్పి, కళ్లు తిరగడం, చూపు మసకబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది యువకులు, మధ్య వయస్కులే ఉండటం గమనార్హం. నవంబర్ 18న ఐదుగురు, గురువారం ఒకరు, శుక్రవారం మరో ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు సేవించిన కల్తీ మద్యాన్ని కక్చింగ్ (Kakching) జిల్లాలోని సుగ్నూ ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కాగా, చందేల్ (Chandel) జిల్లా మణిపూర్ సరిహద్దుల్లో ఉండటం, సరిహద్దులో కంచె లేకపోవడంతో మద్యం అక్రమ రవాణా జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మద్యం ఎక్కడ తయారయిందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్న బాధితులను మణిపూర్ సీఎం యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ (Yumnam Khemchand Singh) పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. షిజా ఆస్పత్రిలో 140 మందికిపైగా, బబీనా ఆస్పత్రిలో 41 మందికిపైగా చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్థానికంగా తయారైన మద్యం, అనుమానాస్పద వనరుల నుంచి లభించే మద్యాన్ని సేవించవద్దని ఆధికారులు ప్రజలకు సూచించారు.
సంబంధిత వార్తలు

Mallikarjun Kharge on Manipur | మళ్లీ రక్తమోడుతున్న మణిపూర్: బీజేపీ అసమర్థత వల్లే ఈ దుస్థితి.. మోదీ, అమిత్ షాలకు ఖర్గే 3 ప్రశ్నలు
అక్టోబర్ 21, 2026

Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ హింస.. మృతదేహాలతో సీఎం బంగ్లాకు
అక్టోబర్ 19, 2026

spurious liquor | నాగాలాండ్‌లో కల్తీ మద్యం కలకలం.. 19 మంది మృతి
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Congress | పార్టీ వ్యవహారాల ఇన్చార్జిని కలవండి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం
- ●Donald Trump | భారత్‌లోనే తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయ్.. ఫెడ్‌పై ట్రంప్ విమర్శలు
- ●Hanuman 2 | ప్రశాంత్ వర్మతో వివాదం - మెగా హీరోతో హనుమాన్ 2 అనౌన్స్
- ●EPFO WhatsApp Service | వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్.. పాస్‌బుక్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
- ●Kiren Rijiju | 1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
- ●Gold And Silver Prices Today | మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఏడాది కనిష్ట స్థాయిలకు చేరిక..

Congress | పార్టీ వ్యవహారాల ఇన్చార్జిని కలవండి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం

Donald Trump | భారత్‌లోనే తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయ్.. ఫెడ్‌పై ట్రంప్ విమర్శలు

Hanuman 2 | ప్రశాంత్ వర్మతో వివాదం - మెగా హీరోతో హనుమాన్ 2 అనౌన్స్

EPFO WhatsApp Service | వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్.. పాస్‌బుక్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?



