Oscars 2027 | ఆస్కార్ రేసులో నాగాలాండ్ మూవీ – 23 రోజుల్లో షూటింగ్ పూర్తి – మతమార్పిడిలపై గిరిజనుల పోరాటం
2027 ఆస్కార్ అవార్డుల్లో ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీ మరాఠీ మూవీ గోంధల్‌ను ఇటీవల ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపికచేసింది. ఈ మరాఠీ మూవీతో మరో భారతీయ సినిమా కూడా ఆస్కార్ అవార్డుల రేసులో నిలవబోతుంది. నాగాలాండ్ మూవీ ఆంఘ్ కూడా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీస్ కేటగిరీలో ఎంట్రీని దక్కించుకుంది.
Entertainment | Published On Sep 28, 2026, 2.26 pm IST
2027 ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా మరాఠీ మూవీ గోంధల్‌ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఎంపికచేసింది. వివిధ భాషల నుంచి 33 సినిమాలు పోటీపడగా...వీటిలో నుంచి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గోంధల్‌ను జ్యూరీ కమిటీ ఫైనల్ చేసింది. గోంధల్‌తో పాటు మరో ఇండియన్ సినిమా కూడా ఆస్కార్ రేసులో నిలిచింది. నాగాలాండ్ మూవీ ఆంఘ్ కూడా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ రాష్ట్రం నుంచి ఆస్కార్ ఎంట్రీని దక్కించుకున్న తొలి సినిమాగా ఆంఘ్ చరిత్రను సృష్టించింది.
కొన్యాక్ భాషలో...
కొన్యాక్ భాషలో కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో డైరెక్టర్ థేజా రియో ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడిగా ఇదే ఆయనకు తొలి సినిమా. తాను చెప్పిన కథతో సినిమాను చేయడానికి నిర్మాతలెవరూ ముందుకు రాకపోవడంతో తన స్నేహితులతో కలిసి థేజా రియో స్వయంగా ఈ సినిమాను నిర్మించారు.
పాత కాలం నాటి కెమెరా...
రియలిస్టిక్ అనుభూతి కోసం నాగాలాండ్‌లోని మారుమూల గిరిజన ప్రాంతాలు, దట్టమైన అడవుల్లో ఈ సినిమా షూటింగ్ చేశారు డైరెక్టర్. డిజిటల్ పద్దతిలో కాకుండా పాతకాలం నాటి కొడాక్ 16 ఎమ్ఎమ్ కెమెరాలతో ఈ సినిమాను చిత్రీకరించారు. ఎన్నో కష్టాలు పడి కేవలం 23 రోజుల్లోనే ఆంఘ్ సినిమా షూటింగ్‌ను పూర్తిచేశారు.
క్రైస్తవ మిషనరీల ఆధిపత్యం...
నాగాలాండ్‌లోని గిరిజన ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీల ఆధిపత్యం పెరుగుతుంటుంది. గిరిజనులంతా క్రైస్తవ మతంలోకి మారిపోతుంటారు. ఈ మతమార్పిడిల నుంచి తన జాతిని కాపాడుకోవడానికి ఓ గిరిజిన తెగకు చెందిన నాయకుడు ఏం చేశాడు? తమ పూర్వీకుల సంప్రదాయాలు, సంస్కృతులకు కాపాడుకునే క్రమంలో అతడి పడిన సంఘర్షణతో ఆంఘ్ మూవీని రూపొందించారు డైరెక్టర్ థేజా రియో.
టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్...
ఇటీవలే ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్లాట్‌ఫామ్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌తో ఆస్కార్ రేసులో నిలిచే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఉన్న అకాడెమీ కమిటీ రూల్స్ ప్రకారం ఆరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులను గెలుచుకున్న సినిమాలు నేరుగా ఆస్కార్ ఎంట్రీ పరిశీలినకు అర్హతను పొందవచ్చు. ఈ రూల్స్ ప్రకారం 2027 ఆస్కార్ అవార్డుల్లో ఆంఘ్ సినిమా బెస్ట్ ఇంటర్నేషన్ ఫీచ్‌ర్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడే ఛాన్స్ దక్కించుకుంది.
ఆంఘ్ సినిమాలో ఆంఘ్‌లాంగ్ కొన్యాక్, డగ్లస్ హోన్యాల్, సోబినో రెంగ్యా కీలక పాత్రల్లో నటించారు. వీరితో పాటు కొన్యాక్ భాషకు చెందిన స్థానిక గిరిజనులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు.
సంబంధిత వార్తలు

spurious liquor | నాగాలాండ్‌లో కల్తీ మద్యం కలకలం.. 19 మంది మృతి
సెప్టెంబర్ 26, 2026

Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా – రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్
సెప్టెంబర్ 21, 2026

Sobhita Dhulipala | నెగెటివ్ రోల్లో అక్కినేని కోడలు – తమిళ సినిమా కోసం డూప్ లేకుండా ఫైట్స్
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Sachin Tendulkar | సచిన్‌తో ఓపెన్ఏఐ పార్ట్నర్షిప్.. చాట్‌జీపీటీ ద్వారా కీలక భాగస్వామ్యం..
- ●Supreme Court | లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ ఉండాల్సిందే: సుప్రీంకోర్టు తీర్పు
- ●CM Vijay | శిశువులకు బంగారు ఉంగరం.. మేనమామ కానుక పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్
- ●IRDAI | ఐఆర్డీఏఐ కొత్త ప్రతిపాదనలతో బీమా స్టాక్స్‌పై ఇన్వెస్టర్ల దృష్టి.. ఏ స్టాక్ అయితే బెటర్..?
- ●Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి తొత్తుగా మారారు: మహేశ్‌కుమార్ గౌడ్
- ●Romantic OTT | ఓటీటీలోకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ

Sachin Tendulkar | సచిన్‌తో ఓపెన్ఏఐ పార్ట్నర్షిప్.. చాట్‌జీపీటీ ద్వారా కీలక భాగస్వామ్యం..

Supreme Court | లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ ఉండాల్సిందే: సుప్రీంకోర్టు తీర్పు

CM Vijay | శిశువులకు బంగారు ఉంగరం.. మేనమామ కానుక పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్

IRDAI | ఐఆర్డీఏఐ కొత్త ప్రతిపాదనలతో బీమా స్టాక్స్‌పై ఇన్వెస్టర్ల దృష్టి.. ఏ స్టాక్ అయితే బెటర్..?



