త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Expired Liquor | గ‌డువు ముగిసిన మ‌ద్యం తాగి.. ముగ్గురు స్నేహితులు మృతి

Expired Liquor | గ‌డువు ముగిసిన మ‌ద్యం (Expired Liquor) తాగిన ముగ్గురు స్నేహితులు మృతిచెందిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని (Uttar Pradesh) ఎటా జిల్లాలో చోటుచేసుకుంది. క‌ఫోర్‌పూర్ గ్రామానికి చెందిన అజిత్ కుమార్ (18), శివ కుమార్ (19), జీతూ కుమార్ (20) స్నేహితులు (Friends), బంధువులు కూడా.

G

National | Published On Nov 12, 2026, 8.36 am IST

Expired Liquor | గ‌డువు ముగిసిన మ‌ద్యం తాగి.. ముగ్గురు స్నేహితులు మృతి
Advertisement

Expired Liquor | త్రినేత్ర న్యూస్‌: గ‌డువు ముగిసిన మ‌ద్యం (Expired Liquor) తాగిన ముగ్గురు స్నేహితులు మృతిచెందిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని (Uttar Pradesh) ఎటా జిల్లాలో చోటుచేసుకుంది. క‌ఫోర్‌పూర్ గ్రామానికి చెందిన అజిత్ కుమార్ (18), శివ కుమార్ (19), జీతూ కుమార్ (20) స్నేహితులు (Friends), బంధువులు కూడా. ఈ నెల 11న (బుధ‌వారం) గ్రామంలో జ‌రిగిన ఓ నిశ్చితార్థ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా స్థానిక పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ముగ్గురూ క‌లిసి మ‌ద్యం సేవించారు. అనంత‌రం బైక్‌పై ఇంటికి వెళ్తుండ‌గా ఒక్క‌సారిగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

దీంతో కుటుంబ స‌భ్యులు వారిని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అప్ప‌టికే వారు మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. వారు గడువు ముగిసిన లేదా కల్తీ మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. అయితే గ‌డువు ముగిసిన మ‌ద్యం తాగ‌డం వ‌ల్లే మారు మ‌ర‌ణించార‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించామ‌ని పోలీసులు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కచ్చితమైన కారణం (గడువు ముగిసిన మద్యమా లేదా కల్తీ మద్యమా అనేది) తెలుస్తుంద‌ని వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తుచేస్తున్నామ‌న్నారు.

 

Advertisement
Advertisement