KTR | ఇదేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు?. ఇదేనా ప్రజలకు ఇచ్చిన హామీల ఫలితం?: కేటీఆర్
KTR | కాంగ్రెస్ (Congress) పాలనలో తెలంగాణలో (Telangana) పరిస్థితి చాలా దారుణంగా దిగజారిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఒక మృతదేహాన్ని కుటుంబ సభ్యులే భుజాలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
KTR | త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ (Congress) పాలనలో తెలంగాణలో (Telangana) పరిస్థితి చాలా దారుణంగా దిగజారిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఒక మృతదేహాన్ని కుటుంబ సభ్యులే భుజాలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బతికి ఉన్నప్పుడు సహాయం లేకపోయినా, మరణానంతరం కనీస గౌరవం కూడా దక్కని పరిస్థితికి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్లిందని మండిపడ్డారు. ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సర్కార్.. ప్రజలకు అవసరమైన కనీస వసతులను అందించడంలో ఘోరంగా విఫలమైందని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
ఈ ఒక్క ఘటన చూస్తే..
`కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిందో ఈ ఒక్క ఘటననే చూస్తే అర్థమవుతున్నది. బతికున్నప్పుడు అండ దొరకలేదు. చనిపోయిన తర్వాత కనీస గౌరవం కూడా దక్కని పరిస్థితికి తెలంగాణను తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ పాలనలో పేదవాడి ఆఖరి ప్రయాణం కూడా గౌరవంగా సాగాలనే ఆలోచనతో ప్రత్యేకంగా పార్థివ దేహాల తరలింపు వాహనాలను ఏర్పాటు చేశారు. అది మానవత్వం, అది ప్రజల గౌరవాన్ని కాపాడే సంకల్పం.
ప్రచారాల కోసం రూ.కోట్లు ఖర్చు..
కానీ ఈ రోజు కాంగ్రెస్ పాలనలో కుటుంబ సభ్యులే మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి రావడం బాధాకరం మాత్రమే కాదు. తెలంగాణ ఆత్మగౌరవానికే మచ్చ. ప్రచారాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం.. పోస్టర్లు, సభలు, యాత్రలు, హెలికాప్టర్ల కోసం ప్రజల డబ్బు వెచ్చించే ప్రభుత్వం.. అదే ప్రజలకు అవసరమైన కనీస అత్యవసర సేవలు అందించలేకపోవడం సిగ్గుచేటు కాదా..?
రాజకీయ ప్రతీకారాలు, విమర్శలు, ప్రచార హడావుడి.. ఇవే తప్ప ప్రజల కష్టాలు కనిపించడం లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి..?. తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్..ప్రతి పేద కుటుంబం గౌరవంగా జీవించాలని పాలన నడిపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు మళ్లీ అవస్థల తెలంగాణను చూస్తున్నారు.
కలచివేసే విషాదం..
ఇదేనా కాంగ్రెస్ చెప్పిన “మార్పు”..?. ఇదేనా ప్రజలకు ఇచ్చిన హామీల ఫలితం..?. తెలంగాణ ప్రజల గౌరవాన్ని వీధుల్లో మోసుకెళ్లడానికేనా ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ప్రజలు..?. మీ అధినేతల జోడో యాత్రలకు జోరుగా బస్సులు ఇవ్వొచ్చు. వారి ఎన్నికల ప్రచారాలకు ప్రభుత్వ వనరులు వినియోగించొచ్చు. మంత్రులు చీటికిమాటికి గాలిమోటార్లు ఎక్కొచ్చు. కానీ పేదోడు జీవితం ముగిసిన తర్వాత కూడా గౌరవంగా చివరి ప్రయాణం చేసే హక్కు ఉండకూడదా..?. ఇది కేవలం ఒక కుటుంబం బాధ కాదు. ఇది తెలంగాణ సమాజాన్ని కలచివేసే విషాదం.` అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసిన రిటైర్డ్ టీచర్.. ఐటీ శాఖ నోటీసులు.. కొట్టేసిన ట్రిబ్యునల్
- ●IND Vs JPN | పోరాడి ఓడిన జపాన్.. రెండు పరుగుల తేడాతో భారత్ విన్.. వైడ్ నిర్ణయంపై హాట్ టాపిక్..!
- ●Heavy Rains | రంగు మారిన నింగి.. ట్యాంక్‌బండ్ నుంచి హైటెక్ సిటీ వరకు జోరు వాన
- ●Tamannaah | వివాదంలో తమన్నా బాలీవుడ్ మూవీ - తన పాటను దొంగిలించారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆరోపణ
- ●Airtel | ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో అదిరిపోయే బెనిఫిట్స్.. యాపిల్ నుంచి ఇవన్నీ ఉచితమే..
- ●Jagadeesh Reddy | వందల ఎకరాలు ఏడున్నయో రాధాకృష్ణ చెప్తే అమ్ముకుంటా

Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసిన రిటైర్డ్ టీచర్.. ఐటీ శాఖ నోటీసులు.. కొట్టేసిన ట్రిబ్యునల్

IND Vs JPN | పోరాడి ఓడిన జపాన్.. రెండు పరుగుల తేడాతో భారత్ విన్.. వైడ్ నిర్ణయంపై హాట్ టాపిక్..!

Heavy Rains | రంగు మారిన నింగి.. ట్యాంక్‌బండ్ నుంచి హైటెక్ సిటీ వరకు జోరు వాన

Tamannaah | వివాదంలో తమన్నా బాలీవుడ్ మూవీ - తన పాటను దొంగిలించారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆరోపణ





