Road Accident | 1000 అడుగుల లోతైన లోయలోకి పడిపోయిన కారు.. 8 మంది యువకులు మృతి
Road Accident | మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఓ కారు అదుపుతప్పి లోతైన లోయలోకి పడిపోయింది.
Road Accident | మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఓ కారు అదుపుతప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. పోలాద్‌పూర్-మహాబలేశ్వర్ రోడ్డులోని ( Mahabaleshwar-Poladpur road) అంబెనాలి ఘాట్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరుస సెలవులు కావడంతో సతారా జిల్లాలోని కోరేగావ్‌కు చెందిన కొందరు యువకులు స్కార్పియో కారులో దాపోలి హర్నే బీచ్‌కు (Dapoli Harne Beach) విహారయాత్రకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారు అంబెనాలి ఘాట్‌లోని దభిల్ టోక్ (Dabhil Tok) వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి వెయ్యి అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో నుంచి ఎనిమిది మంది యువకుల మృతదేహాలను వెలికి తీశారు. మృతులను మహేష్ అనిల్ పవార్ (25), ఆదిత్య అశోక్ సాలుంఖే (21), రితేష్ రాజేంద్ర లోఖండే (25), సుహాస్ జితేంద్ర లోఖండే (20), అన్ష్ సమీర్ చవాన్ (18), ఉత్కర్ష్ ఆనంద్ షింగ్తే (21), అనిల్ అభిమన్యు షింగ్తే (35), నితిన్ కిసాన్ నాయ్కొండే (35)గా గుర్తించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు.
Also Read..
ఐశ్వర్య కేన్స్ లుక్‌పై విమర్శలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్
ఇది మీకు తెలుసా?.. వడదెబ్బతో చనిపోతే రూ.4 లక్షలు పరిహారం..
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడతారంటే?.. షెడ్యూల్ ఇదే..
తాజావార్తలు
- ●Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసిన రిటైర్డ్ టీచర్.. ఐటీ శాఖ నోటీసులు.. కొట్టేసిన ట్రిబ్యునల్
- ●IND Vs JPN | పోరాడి ఓడిన జపాన్.. రెండు పరుగుల తేడాతో భారత్ విన్.. వైడ్ నిర్ణయంపై హాట్ టాపిక్..!
- ●Heavy Rains | రంగు మారిన నింగి.. ట్యాంక్‌బండ్ నుంచి హైటెక్ సిటీ వరకు జోరు వాన
- ●Tamannaah | వివాదంలో తమన్నా బాలీవుడ్ మూవీ - తన పాటను దొంగిలించారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆరోపణ
- ●Airtel | ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో అదిరిపోయే బెనిఫిట్స్.. యాపిల్ నుంచి ఇవన్నీ ఉచితమే..
- ●Jagadeesh Reddy | వందల ఎకరాలు ఏడున్నయో రాధాకృష్ణ చెప్తే అమ్ముకుంటా

Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసిన రిటైర్డ్ టీచర్.. ఐటీ శాఖ నోటీసులు.. కొట్టేసిన ట్రిబ్యునల్

IND Vs JPN | పోరాడి ఓడిన జపాన్.. రెండు పరుగుల తేడాతో భారత్ విన్.. వైడ్ నిర్ణయంపై హాట్ టాపిక్..!

Heavy Rains | రంగు మారిన నింగి.. ట్యాంక్‌బండ్ నుంచి హైటెక్ సిటీ వరకు జోరు వాన

Tamannaah | వివాదంలో తమన్నా బాలీవుడ్ మూవీ - తన పాటను దొంగిలించారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆరోపణ






