త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Plane Hits Paraglider | ఆకాశంలో పారాగ్లైడ‌ర్‌ను ఢీ కొట్టిన విమానం.. భ‌యాన‌క‌ దృశ్యాలు

Plane Hits Paraglider | ఆకాశంలో ఊహించ‌ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. గాల్లో హాయిగా విహ‌రిస్తున్న పారాగ్లైడ‌ర్‌ను ఓ చిన్న విమానం హ‌ఠాత్తుగా ఢీ కొట్టింది (Plane Hits Paraglider). ఊహించ‌ని ఈ ప‌రిణామంతో ఆమె ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. త‌న వ‌ద్ద ఉన్న ఎమ‌ర్జెన్సీ పారాచూట్‌ను తెరిచి ప్రాణాల నుంచి బ‌య‌ట‌ప‌డింది. ఈ ఘ‌ట‌న‌ ఆస్ట్రియాలో చోటుచేసుకుంది.

D

National | Published On May 25, 2026, 11.05 am IST

Plane Hits Paraglider | ఆకాశంలో పారాగ్లైడ‌ర్‌ను ఢీ కొట్టిన విమానం.. భ‌యాన‌క‌ దృశ్యాలు
Advertisement

Plane Hits Paraglider | ఆకాశంలో ఓ పారాగ్లైడర్‌కు భ‌యానక‌ అనుభ‌వం ఎదురైంది. గాల్లో హాయిగా విహ‌రిస్తున్న పారాగ్లైడ‌ర్‌ను ఓ చిన్న విమానం హ‌ఠాత్తుగా ఢీ కొట్టింది. విమానం పారాచూట్ కానోపీని బ‌లంగా ఢీకొట్టడంతో అది రెండు ముక్క‌లైంది. అయితే, అనుభ‌వ‌జ్ఞురాలైన ఆ మహిళ వ‌ద్ద‌ ఎమర్జెన్సీ పారాచూట్ ఉండటంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..? 44 ఏళ్ల సబ్రినా అనే ఒక అనుభవజ్ఞురాలైన మహిళా పారాగ్లైడర్ ఆస్ట్రియాలోని పారాగ్లైడింగ్‌కు ఎంతో ప్రసిద్ధి చెందిన స్మిట్టెన్‌హోహే పర్వత (Schmittenhohe mountain) ప్రాంతానికి వెళ్లింది. అక్క‌డ త‌న హెల్మెట్‌కు కెమెరాను అమ‌ర్చుకుని ఆకాశంలోకి ఎగిరింది. గాల్లో విహ‌రిస్తుండ‌గా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్న‌ట్టుండి ఓ విహార విమానం ఆమెవైపుకు అత్యంత వేగంగా దూసుకొచ్చింది. పారాచూట్ కానోపీని ఢీకొట్టింది.

ఈ ఊహించ‌ని ప్ర‌మాదంలో పారాచూట్ కానోపీ (పారాగ్లైడర్ వింగ్) రెండు ముక్క‌లైంది. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో ఆమె ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి, గాల్లో గుండ్రంగా తిరుగుతూ భయంతో కేకలు వేసింది. ఇంత భ‌యాన‌క ప‌రిస్థితుల్లోనూ ఆమె ఎంతో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించింది. త‌న వ‌ద్ద ఉన్న ఎమ‌ర్జెన్సీ పారాచూట్‌ను తెరిచి ప్రాణాల నుంచి బ‌య‌ట‌ప‌డింది. సురక్షితంగా నేలపై ల్యాండ్ అయింది.

సమాచారం అందుకున్న ఆస్ట్రియన్ పోలీసులు హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. అనంతరం ప్రాథమిక వైద్య పరీక్షల నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్ర‌మాదంలో పారాగ్లైడ‌ర్‌తోపాటూ విమాన పైల‌ట్‌కు కూడా ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. 'జెల్ యామ్ సీ' విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత విమాన‌ పైలట్ అధికారులతో మాట్లాడుతూ.. ఆకాశంలో పారాగ్లైడర్ అకస్మాత్తుగా ఎదురు రావడంతో తాను ప్రమాదాన్ని నివారించలేకపోయానని పేర్కొన్నాడు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సబ్రినా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ మేర‌కు త‌న‌కు ఎదురైన ఈ భ‌యాన‌క అనుభ‌వంపై భావోద్వేగ పోస్ట్ పెట్టింది. నేను ఇక్కడ కూర్చుని ఈ విషయాన్ని టైప్ చేస్తున్నాననే నమ్మకం నాకే కలగడం లేదు అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

Also Read..

1000 అడుగుల లోతైన లోయలోకి ప‌డిపోయిన‌ కారు.. 8 మంది యువ‌కులు మృతి

ఐశ్వ‌ర్య కేన్స్ లుక్‌పై విమ‌ర్శ‌లు.. గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌ కంగ‌నా ర‌నౌత్‌

Advertisement

తాజావార్తలు

Advertisement