Citizenship Status | పౌరసత్వ నిర్ధారణ న్యాయబద్ధంగా ఉండాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Citizenship Status | పౌరసత్వ నిర్ధారణ (Citizenship Status) అనేది రాజ్యాంగపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది.
Citizenship Status | పౌరసత్వ నిర్ధారణ (Citizenship Status) అనేది రాజ్యాంగపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. పౌరసత్వానికి సంబంధించిన అంశాలను న్యాయమైన, చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారానే పరిష్కరించాలని పేర్కొంది. అస్సాం (Assam)లో 27 మంది వ్యక్తుల పౌరసత్వ స్థితిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
పాత ఓటర్ల జాబితాలో జరిగిన టైపింగ్ తప్పిదాలు, స్పెల్లింగ్ మిస్టేక్స్‌ను సాకుగా చూపి అస్సాంకు చెందిన 27 మందిని అధికారులు విదేశీయులుగా ప్రకటించారు. దీనిని గువాహటి హైకోర్టు, ఫారినర్స్ ట్రైబ్యునళ్లు సైతం సమర్థించాయి. ఈ తీర్పులపై బాధితులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బాధితులకు ఊరట కల్పిస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది.
పౌరసత్వం, విదేశీహోదా అనేవి అత్యున్నత రాజ్యాంగ, చట్టపరమైన ప్రాముఖ్యత కలిగిన అంశాలని ధర్మాసనం పేర్కొంది. ఒక వ్యక్తి పౌరసత్వాన్ని ప్రభావితం చేసే ఏ నిర్ణయమైనా కచ్చితంగా న్యాయమైన, చట్టబద్ధమైన, హేతుబద్ధమైన ప్రక్రియ ద్వారానే జరగాలని నొక్కి చెప్పింది. ఎవరైనా వ్యక్తులు చట్టవిరుద్ధంగా, తప్పుడు మార్గాల్లో భారత పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే పూర్తి అధికారం భారత ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి గతంలో గువాహటి హైకోర్టు, ఫారినర్స్ ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ట్రిబ్యునళ్లలో ఈ కేసును కొత్తగా విచారించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అప్పటి వరకూ ఆ 27 మంది వ్యక్తులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read..
తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి రూ.54 వేల కోట్లు బాకీ ఉంది
సినిమాలకు బ్రేక్ - దీపికా పడుకోణ్ కోసం రణ్‌వీర్‌సింగ్ నిర్ణయం
ఇరాన్ హిట్‌లిస్ట్.. జాబితాలో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ, మాక్రాన్..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rahul Gandhi | దేశ విద్యావ్యవస్థ దోపిడీ యంత్రాంగంగా మారింది.. ప్రక్షాళన చేయాలి : రాహుల్ గాంధీ
- ●Shabad Rajkumar Suicide | షాబాద్ ‘సైకో కిల్లర్’ మృతి.. మేనమామ ఊరిలో ఆత్మహత్య
- ●AI Payments | యూపీఐలో ఏఐ విప్లవం.. ఇక వినియోగదారుల అనుమతితో చెల్లింపులు చేయనున్న స్మార్ట్ ఏజెంట్లు..
- ●Ponnam Prabhakar | 3427 దేవాలయాలకు రూ.15.05 కోట్లు విడుదల చేశాం
- ●KGBV Sangareddy Protest | ప్రిన్సిపాల్స్ 'ఈగో' వార్.. నడిరోడ్డుపై 200 మంది విద్యార్థినుల కన్నీటి ధర్నా!
- ●Ayodhya Ram Temple | సీఈవో పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న అయోధ్య ట్రస్టు.. అర్హతలు ఇవే

Rahul Gandhi | దేశ విద్యావ్యవస్థ దోపిడీ యంత్రాంగంగా మారింది.. ప్రక్షాళన చేయాలి : రాహుల్ గాంధీ

Shabad Rajkumar Suicide | షాబాద్ ‘సైకో కిల్లర్’ మృతి.. మేనమామ ఊరిలో ఆత్మహత్య

AI Payments | యూపీఐలో ఏఐ విప్లవం.. ఇక వినియోగదారుల అనుమతితో చెల్లింపులు చేయనున్న స్మార్ట్ ఏజెంట్లు..

Ponnam Prabhakar | 3427 దేవాలయాలకు రూ.15.05 కోట్లు విడుదల చేశాం






