Supreme Court | హత్య నేర నిరూపణకు మృతదేహం తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు
Supreme Court | హత్య నేరం రుజువు కావడానికి మృతదేహం (Deadbody) దొరకడం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. మృతదేహం లభించకపోయినా, ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాల ఆధారంగా నేరం నిర్ధారణ అయితే నిందితుడికి హత్య శిక్ష వేయవచ్చని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
Supreme Court | హత్య నేరం రుజువు కావడానికి మృతదేహం (Deadbody) దొరకడం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. మృతదేహం లభించకపోయినా, ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాల ఆధారంగా నేరం నిర్ధారణ అయితే నిందితుడికి హత్య శిక్ష వేయవచ్చని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు 10 ఏళ్ల బాలికను హత్య చేసి సాక్ష్యాలను మాయం చేసినందుకు గానూ ఓ వ్యక్తికి విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.
అస్సాంలో ఒక వ్యక్తి 10 ఏళ్ల బాలికను హత్య చేసి, శవాన్ని నదిలో పడేశాడు. బాలిక మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు బాలిక మృతదేహం లభించలేదు. ఈ మేరకు పలువురిని విచారించగా.. బాలికతోపాటూ అదే ఇంట్లో ఉంటున్న వ్యక్తిపేరు బయటకు వచ్చింది. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాక్షుల వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా.. గువాహటి కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును నిందితుడు సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో మృతదేహం లభించలేదని అయినప్పటికీ తనకు శిక్ష ఖరారు చేశారంటూ వాదించారు. అయితే, నిందితుడి వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. హత్య నేరానికి మృతదేహాన్ని చూపించడం చట్టపరమైన నిబంధన కాదని స్పష్టం చేసింది. నేరం జరిగినట్లు పక్కా ఆధారాలు ఉంటే సరిపోతుందని పేర్కొంది. మృతదేహాన్ని లభించకుండా పూర్తిగా నాశనం చేసినంత మాత్రాన నిందితులు చట్టం నుండి తప్పించుకోలేరని వ్యాఖ్యానించింది. ఈ మేరకు గువాహటి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్థిస్తూ.. నిందితుడి అప్పీల్‌ను తిరస్కరించింది.
Also Read..
కంటెంట్ క్రియేటర్ల కోసం ఏ ఐప్యాడ్ సెట్ అవుతుంది.. ఫీచర్లు ఎలా ఉండాలి..?
రూ.2 కోట్ల రిటైర్మెంట్ ఫండ్ కోసం ఎస్ఐపీ లేదా లంప్సమ్.. ఏది ఉత్తమం..?
తాజావార్తలు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం
- ●Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం

Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం

Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్






