Arvind Kejriwal | కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు.. కోర్టు తీర్పుపై మాజీ సీఎం భావోద్వేగం
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Policy Case)లో కోర్టు తీర్పుపై కేజ్రీవాల్ స్పందించారు. ఈ మేరకు భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Policy Case)లో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై కేజ్రీవాల్ స్పందించారు. ఈ మేరకు భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.
"లిక్కర్ కేసులో నిందితులు అందరికీ కోర్టు విముక్తి కల్పించింది. అంతిమంగా సత్యమే గెలుస్తుందని మేం ఎప్పుడూ చెబుతూ వచ్చాం. ఇప్పుడు అదే జరిగింది. భారతీయ న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కేజ్రీవాల్ తప్పు చేయలేదు. మా పార్టీని నాశనం చేసేందుకు ఈ కేసులో ఇరికించారు. మద్యం కుంభకోణంలో అవినీతి అనేది పూర్తిగా కల్పితం. ఆప్‌ని నాశనం చేసేందుకు ఐదుగురు కీలక నేతలను జైల్లో పెట్టారు. భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఆయన ఇంటి నుంచి ఈడ్చుకెళ్లి జైల్లో వేశారు. సిసోడియాను దాదాపు రెండేళ్లు జైల్లో ఉంచారు. మాపై అనేక కుట్రలు చేశారు. జైల్లో వేసి వేధించారు. కేజ్రీవాల్ అవినీతిపరుడంటూ వార్తల్లో చూపించారు. కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు. నేను నిజాయితీతో పనిచేశా. వాళ్లు నాపై తప్పుడు కేసు పెట్టారు. అది నేడు రుజువైంది. కేజ్రీవాల్ నిజాయితీ పరుడని, సిసోడియా నిజాయితీ పరుడని కోర్టు తేల్చింది" అంటూ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై పెద్ద రాజకీయ కుట్ర జరిగిందన్నారు. అమిత్‌షా, మోదీ కలిసి ఈ కుట్రపన్నినట్లు ఆరోపించారు.
Also Read..
Liquor Policy Case | లిక్కర్ కేసు.. కేజ్రీవాల్, సిసోడియా, కవితకు భారీ ఊరట
Panneerselvam | అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. డీఎంకేలో చేరిన పన్నీర్ సెల్వం
సంబంధిత వార్తలు

Arvind Kejriwal | ప్రధానికి తెలియకుండా ఇది అసాధ్యం.. రామాలయ విరాళాల దుర్వినియోగంపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
జులై 3, 2026

Telegram Ban India | దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేశారు : టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్, కేజ్రీవాల్ ఫైర్
జూన్ 17, 2026

Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



