Liquor Policy Case | లిక్కర్ కేసు.. కేజ్రీవాల్, సిసోడియా, కవితకు భారీ ఊరట
Liquor Policy Case | మద్యం కుంభకోణం కేసులో (Liquor Policy Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు భారీ ఊరట లభించింది.
Liquor Policy Case | మద్యం కుంభకోణం కేసులో (Liquor Policy Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు భారీ ఊరట లభించింది. మద్యం పాలసీలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఢిల్లీ కోర్టు తేల్చింది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎటువంటి కుట్ర కానీ, నేరపూరిత ఉద్దేశం కానీ లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కేసులో నిందితులందరిపై నమోదైన కేసులను కొట్టేసింది.
ఈ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నకేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందిని డిశ్చార్జ్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా సీబీఐపై కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలున్నాయని పేర్కొంది. ఈ కేసులో ఆధారాలను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు కోర్టు తెలిపింది. చార్జ్‌షీట్‌లో తప్పుదారి పట్టించే వ్యాఖ్యానాలు ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సిసోడియాపై ప్రాథమికంగా కేసు నిలబడేంత ఆధారాలు సీబీఐ సమర్పించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది.
లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో సిసోడియా పాత్ర ఉన్నట్లు చూపించే ఎలాంటి ఆధారాలు లేవని, ఆయన వద్ద నుంచి ఎలాంటి రికవరీ జరగలేదని కోర్టు తెలిపింది. అంతేకాదు, కేజ్రీవాల్‌ను కూడా సరైన ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించారని పేర్కొంది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు మోపడం చట్టపరమైన ప్రమాణాలకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. మౌలిక ఆధారాలు లేకుండా కుట్రలో ఆయన పాత్రను నిర్ధారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కుల్దీప్ సింగ్‌పై కూడా ఎలాంటి స్పష్టమైన ఆధారాలూ లేవని, అయినప్పటికీ ఆయనను మొదటి నిందితుడిగా చేర్చడం ఆశ్చర్యకరమని కోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన విచారణకు కోర్టు ఆదేశించింది.
కేజ్రీ భావోద్వేగం..
కోర్టు తీర్పుపై మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. అంతిమంగా సత్యమే గెలిచిందంటూ పేర్కొన్నారు. కేజ్రీవాల్ తప్పు చేయలేదు.. మా పార్టీని నానశనం చేసేందుకు ప్రయత్నించారు అంటూ వెల్లడించారు. ఈ మేరకు కేజ్రీ భావోద్వేగానికి గురయ్యారు.
ఢిల్లీ మద్యం కేసు.. అరెస్టులు
ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్ 17న నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది. 2022 సెప్టెంబరు చివరికి దానిని వెనక్కి తీసుకుంది. ఈ మధ్యలో మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఆప్ నేతలు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు సీబీఐ, ఈడీలు ఆరోపించాయి. ఇక ఈ మద్యం కుంభకోణంలో భాగంగా ఆప్‌నేతలు కేజ్రీవాల్, సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా పలువురు అరెస్టయ్యారు.
ఈ కేసులో 2024 మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. కేజ్రీవాల్ రెండు విడతల్లో కలిపి సుమారు 156 రోజులు జైలులో ఉన్నారు. 2024 సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. 2023 ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియా అరెస్టు కాగా, ఆయనకి 2024 ఆగస్టు 9న బెయిల్ మంజూరైంది. సిసోడియా సుమారు 530 రోజులు జైలులో గడిపారు. 2024 మార్చి 15న కవిత అరెస్ట్ కాగా.. 2024 ఆగస్టు 27న బెయిల్‌పై కవిత విడుదలయ్యారు.
సంబంధిత వార్తలు

Arvind Kejriwal | ప్రధానికి తెలియకుండా ఇది అసాధ్యం.. రామాలయ విరాళాల దుర్వినియోగంపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
జులై 3, 2026

Telegram Ban India | దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేశారు : టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్, కేజ్రీవాల్ ఫైర్
జూన్ 17, 2026

Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



