త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anant Ambani | మ‌రోసారి మంచి మ‌న‌సు చాటుకున్న అనంత్ అంబానీ.. ఆల‌యాల‌కు భూరి విరాళం

Anant Ambani | రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) మ‌రోసారి త‌న మంచి మ‌న‌సు చాటుకున్నారు. ప్ర‌స్తుతం కేర‌ళ (Kerala) రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్న అనంత్‌.. అక్క‌డి ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి, ఏనుగుల సంక్షేమానికి భారీ విరాళం ప్రకటించారు.

D

National | Published On Apr 7, 2026, 3.22 pm IST

Anant Ambani | మ‌రోసారి మంచి మ‌న‌సు చాటుకున్న అనంత్ అంబానీ.. ఆల‌యాల‌కు భూరి విరాళం
Advertisement

Anant Ambani | రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) మ‌రోసారి త‌న మంచి మ‌న‌సు చాటుకున్నారు. ప్ర‌స్తుతం కేర‌ళ (Kerala) రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్న అనంత్‌.. అక్క‌డి ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి, ఏనుగుల సంక్షేమానికి భారీ విరాళం ప్రకటించారు. కేరళలోని ప్రముఖ ఆలయాలు రాజరాజేశ్వరం ఆలయం (Rajarajeshwaram temple), గురువాయూర్ ఆలయాన్ని (Guruvayur temple) సందర్శించిన‌ అనంత్ అంబానీ ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రెండు ఆలయాలకు చెరో రూ. 3 కోట్లు చొప్పున మొత్తం రూ. 6 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.

అదనంగా, చారిత్రక ప్రాధాన్యత కలిగిన రాజరాజేశ్వరం ఆలయ తూర్పు గోపుర పునరుద్ధరణ పనుల కోసం రూ. 12 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే గురువాయూర్‌లో ఆలయ ఏనుగుల సంక్షేమానికి (elephant welfare) ప్రత్యేక సహాయం అందించనున్నట్లు అనంత్ ఈ సంద‌ర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ.. “భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు. విశ్వాసం, సామాజిక స్పృహ, ప్రకృతితో సమాజ బంధాలను పెంపొందించే సజీవ సంస్థలు. ఈ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు కాపాడటం మనంద‌రి బాధ్యత” అని అన్నారు.

Also Read..

ఆహారంలో పురుగు.. ప్ర‌యాణికుడి ఫిర్యాదుతో సర్వీస్ ప్రొవైడర్‌కు రూ.10 ల‌క్ష‌ల జ‌రిమానా

వ‌ల‌స కార్మికుల‌కు భారీ ఊర‌ట‌.. 5 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా రెట్టింపు

ఆఫ్‌లైన్ ఏఐ టూల్‌ను లాంచ్ చేసిన గూగుల్‌.. ఎన్నో అద్భుత‌మైన ఫీచ‌ర్లు..

Advertisement
Advertisement