Chhotu LPG | వలస కార్మికులకు భారీ ఊరట.. 5 కిలోల గ్యాస్ సిలిండర్ సరఫరా రెట్టింపు
Chhotu LPG | వలస కార్మికులకు (Migrants) కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. వలస కూలీల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 5 కిలోల ఎఫ్‌టీఎల్ గ్యాస్ సిలిండర్ల (5 Kg Cylinders) సరఫరాను రోజూవారీ కోటాలో పెంచాలని నిర్ణయించింది.
Chhotu LPG | వలస కార్మికులకు (Migrants) కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. వలస కూలీల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 5 కిలోల ఎఫ్‌టీఎల్ గ్యాస్ సిలిండర్ల (5kg Free Trade LPG cylinde) సరఫరాను రోజూవారీ కోటాలో పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ఓఎంసీల సహాయంతో పౌర సరఫరాల శాఖ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని సూచించారు.
సాధారణ గృహ గ్యాస్ కనెక్షన్ పొందాలంటే వినియోగదారులు ఖచ్చితంగా అడ్రెస్ ప్రూఫ్ (Address Proof) సమర్పించాల్సి ఉంటుంది. వలస కార్మికులకు ఇది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. దీనివల్ల వారు గ్యాస్ కోసం బ్లాక్‌మార్కెట్‌ను ఆశ్రయించి భారీ ధరలు చెల్లించాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికే ‘ఛోటూ’ అనే 5 కేజీల సిలిండర్‌ను (Chhotu LPG) కేంద్రం ప్రారంభించింది. ఏదైనా ఒక గుర్తింపు కార్డు (ID Proof) చూపించి ఈ 5 కిలోల సిలిండర్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, ఇందులో బైబ్యాక్ సదుపాయాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్‌ను తొందరగా పొందడం కష్టంగా మారింది. అందుకే కేంద్ర సర్కారు వలసకార్మికుల సౌలభ్యం కోసం 5 కేజీల సిలిండర్‌ల సరఫరాను రెట్టింపు చేసింది.
ఈ ఏడాది మార్చి 2-3 తేదీల్లో వలస కార్మికులకు సరఫరా చేసిన సగటు సిలిండర్ల ఆధారంగా ఈ అదనపు కేటాయింపులను లెక్కించనున్నారు. గతంలో మార్చి 21న జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఉన్న 20 శాతం గరిష్ట పరిమితికి ఇది అదనంగా ఉంటుంది. అయితే ఈ అదనపు సిలిండర్లను కేవలం వలస కార్మికులకు సరఫరా చేయడానికి మాత్రమే ఉపయోగించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఫలితంగా ఎల్పీజీ కొరత ఏర్పడింది. ప్రపంచ దేశాల్లో గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హర్మూజ్ జలసంధి గుండా ఇరాన్ కొన్ని దేశాలను మాత్రమే అనుమతిస్తుండటంతో మిగతా దేశాలు అవస్థలు పడుతున్నాయి. మన దేశ నౌకలకు హర్మూజ్ జలసంధిలో సురక్షిత ప్రయాణానికి ఇరాన్ అనుమతించింది. అయినప్పటికీ గ్యాస్ కష్టాలు మాత్రం తీరడం లేదు. ఫలితంగా రెగ్యులర్ సిలిండర్ పొందడానికి కావాల్సిన నిబంధనలను ఇప్పుడు కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read..
ఆహారంలో పురుగు.. ప్రయాణికుడి ఫిర్యాదుతో సర్వీస్ ప్రొవైడర్‌కు రూ.10 లక్షల జరిమానా
రానున్న 12 గంటల పాటూ రైలు ప్రయాణాలు చేయకండి.. ప్రజలకు కీలక హెచ్చరికలు
ఒక శాతం తగ్గిన నాన్‌వెజ్ థాలీ.. స్థిరంగా శాఖాహార భోజనం ధర
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



