AI Edge Eloquent | ఆఫ్‌లైన్ ఏఐ టూల్‌ను లాంచ్ చేసిన గూగుల్.. ఎన్నో అద్భుతమైన ఫీచర్లు..
AI Edge Eloquent | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ మరో నూతన ఏఐ టూల్‌ను ప్రవేశపెట్టింది. ఈ టూల్ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా మైక్రోఫోన్‌లో మాట్లాడే విషయాలను ఆటోమేటిగ్గా సరిచేస్తుంది. గూగుల్ ఏఐ ఎడ్జ్ ఎలోక్వెంట్ పేరిట ఆ సంస్థ రిలీజ్ చేసిన ఈ టూల్ ప్రస్తుతం అన్ని ఐఓఎస్ డివైస్‌లకు అందుబాటులో ఉంది.
Technology | Published On Apr 7, 2026, 3.14 pm IST
AI Edge Eloquent | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ మరో నూతన ఏఐ టూల్‌ను ప్రవేశపెట్టింది. ఈ టూల్ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా మైక్రోఫోన్‌లో మాట్లాడే విషయాలను ఆటోమేటిగ్గా సరిచేస్తుంది. గూగుల్ ఏఐ ఎడ్జ్ ఎలోక్వెంట్ పేరిట ఆ సంస్థ రిలీజ్ చేసిన ఈ టూల్ ప్రస్తుతం అన్ని ఐఓఎస్ డివైస్‌లకు అందుబాటులో ఉంది. కానీ ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రం కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఈ టూల్ పేరు సాధారణంగా యూజర్లకు గుర్తుండదు. అంత ఆకర్షణీయంగా లేదు. ఏఐ ఎడ్జ్ ఎలోక్వెంట్ అనే పేరును సాధారణంగా చాలా మంది గుర్తుంచుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే పేరు విషయాన్ని పక్కన పెడితే ఫీచర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు.
యూజర్ల మాటలు టెక్ట్స్ రూపంలో..
ఏఐ ఎడ్జ్ ఎలోక్వెంట్ టూల్‌లో పలు భిన్న రకాల ఫీచర్లను అందిస్తున్నారు. ఇంటర్నెట్‌లో స్పీచ్, ఆడియో కంటెంట్ క్రియేషన్ విధానాన్ని ఇది పూర్తిగా మార్చేస్తుంది. ఈ యాప్ యూజర్ల మాటలను టెక్ట్స్‌గా మారుస్తుంది. ఇంగ్లిష్‌లో వాడే uh, um వంటి అనవసర పదాలను తొలగిస్తుంది. మాట్లాడిన విషయాన్ని కచ్చితత్వంతో, స్పష్టంగా, క్రమబద్దంగా, ప్రొఫెషనల్ టెక్ట్స్‌గా మారుస్తుంది. యూజర్ల డేటాను క్లౌడ్‌కు పంపించాల్పిన అవసరం లేకుండా పూర్తిగా ఆఫ్ లైన్ మోడ్‌లోనే ఈ టూల్ పనిచేస్తుంది. ఫోన్‌లోని హార్డ్‌వేర్ వనరులను ఉపయోగించుకుని ఏఐ మోడల్స్‌ను రన్ చేసి యూజర్‌కు కావల్సిన ఔట్ పుట్‌ను ఇస్తుంది.
ప్రత్యేకంగా క్లౌడ్ ఆప్షన్..
ఈ టూల్ యూజర్లు మాట్లాడే మాటలను కీ పాయింట్స్, ఫార్మల్, షార్ట్, లాంగ్ వంటి పలు ఫార్మాట్‌లలోకి సైతం మారుస్తుంది. అవసరం అయితే గూగుల్ సర్వర్లకు కూడా కనెక్ట్ అవగలదు. అందులో జెమిని సహాయంతో టెక్ట్స్‌ను మరింత మెరుగు పరిచి యూజర్‌కు అందిస్తుంది. అయితే ఈ సేవలను ఉపయోగించడానికి యూజర్లు ప్రత్యేకంగా క్లౌడ్ ఆప్షన్ ను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఈ టూల్‌లో యూజర్లు మాట్లాడే మాటలను, పదజాలాన్ని ఏఐ సులభంగా నేర్చుకుంటుంది. దీని వల్ల తరచూ ఉపయోగించే పదాలు, పదబంధాలు, పేర్లను మరింత కచ్చితత్వంతో గుర్తించి ఉపయోగిస్తుంది. అలాగే వర్డ్ కౌంట్ చెప్పడం, పాత రికార్డింగ్స్‌ను సెర్చ్ చేయడం వంటి సదుపాయాలు కూడా ఈ టూల్‌లో ఉన్నాయి.
ఆఫ్‌లైన్ ఏఐ యాప్‌లకు పోటీగా..
గూగుల్ లాంచ్ చేసిన ఏఐ ఎడ్జ్ ఎలోక్వెంట్ టూల్‌ను గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఐఎన్‌సీకి చెందిన ఏఐ ప్రొడక్ట్స్ జాబితాలో చేర్చారు. నోట్‌బుక్ ఎల్ఎం, వర్క్ స్పేస్ ఏఐ, వర్టెక్స్ ఏఐ, గూగుల్ విడ్స్ వంటి ఏఐ టూల్స్ ను ఈ సంస్థ అందిస్తోంది. ఆఫ్‌లైన్ ఏఐ యాప్‌ల రంగంలో గూగుల్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ యాప్ ఎంతో కీలకం కానుంది. ఈ విభాగంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న విస్పర్ ఫ్లో, సూపర్ విస్పర్ వంటి యాప్‌లకు ఈ టూల్ గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






